విద్యే జీవితాన్ని మారుస్తుంది.. అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
- విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమన్న సీఎం
- ప్రత్యేక విద్యా కమిషన్ ఏర్పాటు చేశామని వెల్లడి
- 28,163 ప్రభుత్వ విద్యాసంస్థల్లో 28.77 లక్షల మంది విద్యార్థులున్నట్లు వెల్లడి
- ఏడాదిలో 11 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు ప్రకటన
- 10,600 మంది టీచర్లకు 55 రోజుల్లో నియామక పత్రాలిచ్చినట్లు వెల్లడి
విద్యే జీవితాలను మార్చే శక్తి అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చదువుకు దూరమైతే ఎంత ఆస్తి ఉన్నా సామాజికంగా వెనుకబడే పరిస్థితి ఉంటుందని చెప్పారు. 2024లో నిర్వహించిన సీపెక్ సర్వేలోనూ ఇదే విషయం వెల్లడైందన్నారు. అక్షరం ఒక్కటే మనిషి జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తెలంగాణ విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చుతున్నామని అసెంబ్లీలో తెలిపారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దేందుకు ప్రత్యేక విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా కొత్త మార్గదర్శకాలు రూపొందించేందుకు కేశవరావు కమిటీని నియమించినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 28,163 ప్రభుత్వ విద్యాసంస్థల్లో 28.77 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని వివరించారు. వీరికి 1.57 లక్షల మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారని చెప్పారు. జెన్ జీతో పాటు జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాల భవిష్యత్తును తరగతి గదుల్లోనే తీర్చిదిద్దుతామని అన్నారు.
ఉపాధ్యాయుల నియామకంలో తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో 7,857 మంది టీచర్లను మాత్రమే నియమించిందని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 11 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని వెల్లడించారు. ఎలాంటి అవినీతికి అవకాశం లేకుండా 55 రోజుల్లో 10,600 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించామని తెలిపారు. రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి, తెలంగాణలో 17 మందికే ఒక ఉపాధ్యాయుడు ఉన్నారని వివరించారు.
విద్యా రంగానికి గతంలో తగ్గుతూ వచ్చిన బడ్జెట్ కేటాయింపులను తమ ప్రభుత్వం పెంచుతోందని సీఎం చెప్పారు. అసెంబ్లీ సభ్యులు ఇచ్చిన సూచనలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తెలంగాణ విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యమన్నారు. దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలకు పునాదులు వేసిన పండిట్ నెహ్రూ ఆలోచనలతో ముందుకు సాగుతామని తెలిపారు. భవిష్యత్ తరాలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.