ఆస్ట్రేలియాలో ఇవన్నీ కామన్.. కానీ, భారతీయులకు మాత్రం షాక్!
- ఆస్ట్రేలియాలో సాయంత్రం 5 గంటలకే షాపులు క్లోజ్
- నగరాల్లో గుర్రాలపై పోలీసులు కనిపిస్తారని తెలిపిన దిశా
- బాస్, టీచర్, డాక్టర్‌ను పేరుతో పిలుస్తారని వెల్లడి
- ఆఫీసు వేళలు పూర్తి కాగానే ఉద్యోగులు ఇంటికి వెళ్తారని తెలిపిన దిశా
- వ్యక్తిగత సమయం, కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తారని వెల్లడి
దేశం మారితే జీవన విధానంలో ఎన్నో తేడాలు కనిపిస్తాయి. మనకు సాధారణంగా అనిపించే విషయాలు మరో దేశంలో వింతగా అనిపించొచ్చు. ఆస్ట్రేలియాకు వెళ్లిన దిశా షా అనే భారతీయ మహిళకు ఎదురైన కొన్ని అనుభవాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీశాయి. అక్కడ తనను ఆశ్చర్యపరిచిన ఐదు విషయాలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
సాయంత్రం 5 గంటలకే షాపులు క్లోజ్
ఆస్ట్రేలియాలో చాలా దుకాణాలు సాయంత్రం 5 గంటలకే మూసేస్తారని దిశా చెప్పారు. శనివారం సాయంత్రం 6 గంటలకు షాప్‌నకు వెళ్తే తెరిచి ఉన్నది దొరకడం కష్టమన్నారు.
గుర్రాలపై పోలీసుల పెట్రోలింగ్
నగర కేంద్రాల్లో గుర్రాలపై పోలీసులు తిరగడం కూడా తనకు ఆశ్చర్యంగా అనిపించిందని ఆమె చెప్పారు. అక్కడ ఇది సాధారణమే అయినా.. భారతీయురాలిగా తనకు ప్రతిసారీ కొత్తగానే అనిపిస్తుందని తెలిపారు.
బాస్‌ను పేరుతో పిలుస్తారు
బాస్, టీచర్, డాక్టర్‌ను కూడా వారి పేరుతో పిలవడం అక్కడ సాధారణమని దిశా చెప్పారు. ‘సర్’, ‘మేడమ్’, ‘ఆంటీ’, ‘అంకుల్’ వంటి సంబోధనలు పెద్దగా ఉండవని పేర్కొన్నారు.
ఆఫీసులో టైమ్ అయిందంటే వెళ్లిపోతారు
ఆస్ట్రేలియాలో ఉద్యోగం పూర్తయిన తర్వాత సమయానికి ఇంటికి వెళ్లడాన్ని సాధారణంగానే చూస్తారని ఆమె తెలిపారు. ఎక్కువసేపు ఆఫీసులో ఉండటాన్ని గొప్పగా భావించరని చెప్పారు. కుటుంబం, వ్యక్తిగత సమయం, వారాంతాలకు ప్రాధాన్యం ఇస్తారని పేర్కొన్నారు.
పబ్లిక్ పార్కుల్లో ఉచిత సదుపాయాలు
ఉచిత బార్బెక్యూ సదుపాయాలు, శుభ్రమైన పబ్లిక్ టాయిలెట్లు, వాకింగ్ ట్రాక్‌లు, పిల్లల ఆటస్థలాలు, పిక్నిక్ ప్రాంతాలు ఆకట్టుకున్నాయని దిశా చెప్పారు. వీటిలో చాలా సదుపాయాలను ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపారు.