శాంతిభద్రతలే లక్ష్యం: 'త్రిశూల్' ఆపరేషన్‌కు సీఎం చంద్రబాబు ఆదేశం

శాంతిభద్రతలే లక్ష్యం: 'త్రిశూల్' ఆపరేషన్‌కు సీఎం చంద్రబాబు ఆదేశం

Chandrababu Naidu orders Operation Trishul to ensure Law and Order in Andhra Pradesh
  • 'త్రిశూల్' పేరుతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆదేశం
  • డ్రగ్స్, మహిళలపై వేధింపులు, రోడ్డు ప్రమాదాల నిర్మూలనే లక్ష్యం
  • సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై కఠిన చర్యలకు దిశానిర్దేశం
  • రాష్ట్రంలో నేరాల రేటు 14 శాతం తగ్గిందన్న ముఖ్యమంత్రి
  • రోడ్డు ప్రమాదాల్లో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఆవేదన
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా ఎస్పీలు, కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో 'త్రిశూల్' పేరుతో ప్రత్యేక కార్యాచరణకు ఆయన శ్రీకారం చుట్టారు. 'జీరో డ్రగ్స్, మహిళలపై వేధింపుల పట్ల జీరో టాలరెన్స్, జీరో రోడ్డు ప్రమాదాలు' లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 'త్రిశూల్' పేరుతో రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి, స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, వ్యవస్థీకృతంగా సాగుతున్న వేధింపులపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. ఈ అంశాలపై మంత్రుల కమిటీ లోతైన అధ్యయనం చేస్తుందని ఆయన తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం ప్రతి జిల్లాకు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 30 మంది కానిస్టేబుళ్లను కేటాయించినట్లు వెల్లడించారు.

గంజాయి సహా మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక క్యాలెండర్ రూపొందించి విస్తృత ప్రచారం కల్పించాలని, విశాఖపట్నం, తిరుపతి, అమరావతి నగరాల్లో డీ-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండటంపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం, ప్రతి ప్రమాదాన్ని క్షుణ్ణంగా ఆడిట్ చేసి, అందుకు గల కారణాలను విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు.

గత రెండేళ్లలో రాష్ట్రంలో నేరాలు 14 శాతం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 29.2 శాతం తగ్గాయని చంద్రబాబు వివరించారు. ప్రస్తుతం శిక్షల ఖరారు రేటు (కన్విక్షన్ రేటు) 47 శాతంగా ఉందని, దీనిని మరింత పెంచాలని సూచించారు. నేరం జరిగిన 30 నిమిషాల్లోపే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవాలని, కేసుల సత్వర పరిష్కారానికి 'వన్ కోర్టు-వన్ కానిస్టేబుల్' విధానాన్ని పరిశీలించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Advertisement
Chandrababu Naidu
Operation Trishul
Andhra Pradesh Law and Order
Zero Drugs AP
Women Safety Andhra Pradesh

More Telugu News