ఆహారంపై చాలామందికి తెలియని 3 నిజాలు.. నిపుణురాలు ఏం చెప్పారంటే!

ఆహారంపై చాలామందికి తెలియని 3 నిజాలు.. నిపుణురాలు ఏం చెప్పారంటే!

3 Facts About Food Many People Do Not Know What the Expert Said
  • ఆహార లేబుళ్లు చదవడం నేర్చుకోవాలని సూచన
  • ప్రకటనల కంటే ప్యాకెట్‌లోని అసలు వివరాలను చూడాలని సలహా
  • సహజ ఆహారాలపై అవగాహన పెంచుకోవాలని సూచన
  • ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని తగ్గించాలన్న నిపుణురాలు
  • వంట చేయడం కూడా ముఖ్యమైన నైపుణ్యమని వెల్లడి
ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? అనే విషయాలపై ఇప్పుడు చాలామందికి అవగాహన పెరిగింది. అయినా ఆహారంపై కొన్ని ప్రాథమిక విషయాలు మాత్రం చాలామందికి తెలియవు. ముఖ్యంగా ప్యాకెట్‌ ఆహారాలపై కనిపించే ప్రకటనలను నమ్మే ముందు.. అందులో అసలు ఏముందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో పోషకాహార నిపుణురాలు దీపశిఖా జైన్‌ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మూడు ముఖ్యమైన విషయాలను సూచించారు.

ఆహార లేబుళ్లు చదవాలి
ప్యాకెట్‌పై ‘లో ఫ్యాట్‌’, ‘రియల్‌ ఫ్రూట్స్‌తో తయారీ’ వంటి పదాలు కనిపించగానే అది ఆరోగ్యకరమైన ఆహారమని భావించకూడదని ఆమె చెప్పారు. లేబుల్‌పై ఉన్న పదార్థాలు, పోషక విలువలను పరిశీలించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రకటనల కంటే ప్యాకెట్‌పై ఉన్న అసలు సమాచారాన్ని చూడాలని చెప్పారు.

సహజ ఆహారాలపై అవగాహన
పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పప్పుల వంటి సహజ ఆహారాలు ఏవో తెలుసుకోవడం కూడా ముఖ్యమేనని దీపశిఖా పేర్కొన్నారు. ప్రాసెస్‌ చేసిన, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారంతో పోలిస్తే సహజ ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఎందుకు అవసరమో తెలుసుకోవాలని సూచించారు.

వంట చేయడం కూడా ఒక నైపుణ్యమే
సొంతంగా భోజనం సిద్ధం చేసుకోవడం, సరైన ఆహారాన్ని ఎంచుకోవడం కూడా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయాలేనని ఆమె చెప్పారు. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. ఆహారంపై నమ్మకం పెరుగుతుంది. సమతుల్యమైన భోజనం ఎలా సిద్ధం చేసుకోవాలో కూడా తెలుస్తుందని వివరించారు.

ఈ మూడు విషయాలను పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు నేర్పించాలని దీపశిఖా జైన్‌ సూచించారు. అయితే ఇవి విద్యార్థులకే కాకుండా పెద్దలకు కూడా ఉపయోగపడతాయని చెప్పారు.
Advertisement
Deepshikha Jain
Nutritionist
Healthy Diet Tips
Food Label Awareness
Natural Foods
Cooking Skills

More Telugu News