రూ.100 కోట్ల ఓపెనింగ్.. రూ.300 కోట్ల నష్టం! యశ్ ‘టాక్సిక్’కు ఏమైంది?
- ‘టాక్సిక్’ తొలి రోజు రూ.140 కోట్ల గ్రాస్
- 15 రోజులకు రూ.339 కోట్లకు పైగా వసూలు
- సినిమా బడ్జెట్ రూ.450 కోట్లకు పైగానే ఉన్నట్లు అంచనా
- ‘టాక్సిక్’ నష్టం రూ.300-350 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా
- ఓటీటీ హక్కుల విషయంలోనూ నిర్మాతలకు ఎదురుదెబ్బ
యశ్ సినిమా అంటేనే భారీ అంచనాలు. ‘కేజీఎఫ్-2’ తర్వాత ఆయన నటించిన ‘టాక్సిక్’పై కూడా అదే స్థాయిలో హైప్ వచ్చింది. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. భారీ ఓపెనింగ్ వచ్చినా.. ఆ తర్వాత కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో ఈ చిత్రం భారీ నష్టాల్లోకి వెళ్లినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
‘టాక్సిక్’ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.140 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. భారత్‌లో నెట్ వసూళ్లు సుమారు రూ.101 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో సినిమా బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళ్తుందని భావించారు.
అయితే రెండో రోజు నుంచే పరిస్థితి మారిపోయింది. భారత్‌లో రెండో రోజు వసూళ్లు దాదాపు రూ.37 కోట్లకు పడిపోయాయి. తొలి సోమవారానికి రూ.10 కోట్ల కంటే దిగువకు చేరాయి. 15 రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ.339 కోట్లకు పైగా వసూలైనట్లు లెక్కలు చెబుతున్నాయి. 16వ రోజు భారత్‌లో కేవలం రూ.40 లక్షల మేరే వసూళ్లు వచ్చినట్లు సమాచారం.
ఈ సినిమాకు నిర్మాణ వ్యయం దాదాపు రూ.450 కోట్లు ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ప్రచారం, విడుదల ఖర్చులు, వడ్డీలు కలిపితే మొత్తం పెట్టుబడి రూ.500 కోట్లకు చేరినట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో థియేట్రికల్ వసూళ్లు సరిపోక భారీ నష్టం తప్పలేదని ట్రేడ్ విశ్లేషకుడు రమేశ్ బాలా అభిప్రాయపడ్డారు.
‘టాక్సిక్’ నష్టం రూ.300 కోట్ల నుంచి రూ.350 కోట్ల వరకు ఉండొచ్చని ఆయన తెలిపారు. ‘గేమ్ ఛేంజర్’, ‘ఆదిపురుష్’ వంటి భారీ చిత్రాల సరసన ఇప్పుడు ‘టాక్సిక్’ కూడా చేరినట్లయింది.
ఓటీటీ హక్కులను ముందుగానే విక్రయించకపోవడం కూడా సినిమాకు ప్రతికూలంగా మారిందని బాలా చెప్పారు. భారీ వసూళ్లు వస్తాయని ఎదురుచూసిన నిర్మాతలకు.. సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఓటీటీ విలువ కూడా గణనీయంగా పడిపోయినట్లు తెలుస్తోంది.