అమెరికాలో భారత విద్యార్థికి 30 నెలల జైలు శిక్ష
- టెక్ సపోర్ట్ పేరుతో వృద్ధుడిని మోసం చేసిన వైనం
- బాధితుడికి సుమారు లక్ష డాలర్లు చెల్లించాలని కోర్టు ఆదేశం
- శిక్ష తర్వాత మరో మూడేళ్ల పాటు అధికారుల పర్యవేక్షణ
- రెండోసారి డబ్బుల కోసం వెళ్లగా పట్టుకున్న పోలీసులు
అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన ఓ భారత విద్యార్థి మోసం కేసులో జైలు పాలయ్యాడు. టెక్ సపోర్ట్ పేరుతో వియత్నాం యుద్ధంలో పాల్గొన్న ఓ వృద్ధుడిని మోసగించిన కేసులో వెంకటేశ్వర చాగంరెడ్డి అనే విద్యార్థికి అమెరికా కోర్టు 30 నెలల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు బాధితుడికి 99,496 డాలర్లు (దాదాపు రూ. 83 లక్షలు) పరిహారంగా చెల్లించాలని, శిక్ష పూర్తయ్యాక మరో మూడేళ్ల పాటు అధికారుల పర్యవేక్షణలో ఉండాలని ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే, ఒక్లహామాలో నివసిస్తున్న ఓ వృద్ధుడికి, మైక్రోసాఫ్ట్ టెక్నికల్ సపోర్ట్ ప్రతినిధిగా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. బాధితుడి కంప్యూటర్‌లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని బెదిరించాడు. భయపడిపోయిన బాధితుడిని, తన వద్ద ఉన్న నగదును బంగారంగా మార్చి, ఇంటికి వచ్చే ఫెడరల్ అధికారికి ఇవ్వాలని సూచించాడు.
నిందితుడి మాటలు నమ్మిన బాధితుడు అలాగే చేశాడు. అయితే, కొద్ది రోజుల తర్వాత నిందితుడు మళ్లీ ఫోన్ చేసి, మరింత డబ్బు డిమాండ్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు, తన కుటుంబ సభ్యుల సహాయంతో తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రెండో విడత డబ్బు తీసుకునేందుకు బాధితుడి ఇంటికి వచ్చిన వెంకటేశ్వర చాగంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో స్టూడెంట్ వీసాపై నివసిస్తున్న చాగంరెడ్డిని ఈ కేసులో ఏప్రిల్‌లోనే దోషిగా నిర్ధారించగా, తాజాగా శిక్ష ఖరారు చేశారు.