టైర్లు నల్లగానే ఎందుకుంటాయి? చాలామందికి తెలియని నిజం!
- తొలుత టైర్లు తెల్లగానే ఉండేవి
- రబ్బరుకు సహజంగా రంగు ఉండదు
- కార్బన్ బ్లాక్‌తో టైర్ల మన్నిక పెరిగింది
- వేడి, రాపిడిని తట్టుకునే శక్తి మెరుగైంది
- 1970ల నుంచి నల్ల టైర్లు సాధారణమైపోయింది
కారు కొనేటప్పుడు రంగు నుంచి ఇంజిన్ వరకు ఎన్నో విషయాలు చూస్తాం. కానీ టైర్లను మాత్రం పెద్దగా పట్టించుకోం. అన్ని వాహనాలకు టైర్లు నల్లగానే ఎందుకు ఉంటాయనే ఆలోచన కూడా చాలా మందికి రాదు. అయితే దీని వెనుక ఆసక్తికరమైన కారణం ఉంది.
నిజానికి టైర్లు మొదట్లో నల్లగా ఉండేవి కావు. తొలి దశలో తయారైన టైర్లు తెల్లగా ఉండేవి. రబ్బరుకు సహజంగా ప్రత్యేకమైన రంగు ఉండదు. అప్పట్లో టైర్ల తయారీలో జింక్ ఆక్సైడ్‌ను ఎక్కువగా వాడేవారు. అది తెల్లగా ఉండేది.
నల్ల రంగు ఎందుకొచ్చింది?
1900ల ప్రారంభంలో టైర్ల తయారీలో కీలక మార్పు వచ్చింది. రబ్బరులో కార్బన్ బ్లాక్‌ను కలపడం మొదలుపెట్టారు. దీనివల్ల టైర్ల మన్నిక భారీగా పెరిగింది. వేడిని తట్టుకునే శక్తి పెరిగింది. రాపిడిని కూడా మెరుగ్గా తట్టుకునేలా మారాయి.
ఫలితంగా టైర్లు ఎక్కువ కాలం పనిచేశాయి. దీంతో కార్ల టైర్లలో కార్బన్ బ్లాక్ వాడకం పెరిగింది. టైర్ల నడిచే భాగంతో పాటు పక్క భాగాల్లోనూ దీనిని కలపడం మొదలుపెట్టడంతో అవి పూర్తిగా నల్లగా మారాయి.
మధ్యలో మరో రకం
అయితే కార్బన్ బ్లాక్ తగినంతగా అందుబాటులో లేని సమయంలో కొన్ని కంపెనీలు తెల్లని పక్క భాగాలతో టైర్లను తయారు చేశాయి. మధ్యలో నల్లని భాగం ఉండేది. ఇవి ఒకప్పుడు బాగా కనిపించేవి. 1970ల ప్రారంభం నుంచి నల్ల టైర్లే సాధారణంగా మారిపోయాయి.
కార్బన్ బ్లాక్ అనేది పెట్రోలియం ఆధారిత పదార్థాల అసంపూర్ణ దహనం ద్వారా తయారవుతుంది. ఇది టైర్లకే కాకుండా ప్రింటింగ్ ఇంక్, టోనర్ వంటి వాటిలోనూ నల్ల రంగు కోసం ఉపయోగిస్తారు.