కడప జిల్లా పర్యటన రద్దు చేసుకున్న ఏపీ సీఎం జగన్
- షెడ్యూల్ ప్రకారం నేడు కడప జిల్లాలో సీఎం పర్యటన
- కడప ఎయిర్ పోర్టు వద్ద దట్టంగా పొగమంచు
- లభించని ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్
- చివరి నిమిషంలో పర్యటన విరమించుకున్న సీఎం జగన్
ఇవాళ కడపలోని అమీన్ పీర్ ఉర్సు ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. ఈ మధ్యాహ్నం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే కడప విమానాశ్రయం పరిసరాల్లో పొగమంచు ఎంతకీ తొలగకపోవడంతో సీఎం పర్యటన రద్దయింది.