ఆఫ్గనిస్థాన్​ లోనూ పబ్​ జీ, టిక్​ టాక్​ పై నిషేధం

Taliban to soon ban PUBG and TikTok in Afghanistan
  • 90 రోజుల్లో బ్యాన్ చేయాలని తాలిబన్ల ప్రకటన
  • దేశ యువతను తప్పుదోవ పట్టిస్తున్నందుకే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి
  • ఆఫ్ఘన్ లో ఇప్పటికే 23 మిలియన్ల వెబ్ సైట్లు బ్లాక్
మొబైల్ గేమింగ్ లో ప్రపంచాన్ని ఊపు ఊపేసిన అప్లికేషన్ పబ్ జీ. దాంతో పాటు, వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ ను భారత్, పాకిస్థాన్ వంటి దేశాలు బ్యాన్ చేశాయి. జాతీయ భద్రత, హింసను ప్రోత్సహించడం వంటి అనేక కారణాల వల్ల పబ్ జీపై నిషేధం విధించాయి. 

ఇప్పుడు అఫ్ఘనిస్థాన్ లో కూడా వీటిపై బ్యాన్ విధించాలని తాలిబన్లు నిర్ణయించారు. మూడు నెలల్లో ఈ రెండు యాప్ లను తమ దేశంలో ఎవ్వరూ ఉపయోగించకుండా చేయనున్నారు. వీటి వల్ల తమ దేశ యువత తప్పుదోవ పట్టకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తాలిబన్లు చెబుతున్నారు.  భద్రత, షరియా చట్ట అమలు సంస్థ సభ్యులతో దేశ టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించిన తర్వాత 90 రోజులలో పబ్ జీ, టిక్‌టాక్ ను ఆఫ్ఘన్ లో నిషేధిస్తున్నట్టు ప్రకటన వెలువడింది.

పబ్ జీ నిషేధం అమలులోకి రావడానికి మూడు నెలల వరకు పట్టినా..  ఒక నెలలో టిక్‌టాక్ నిషేధాన్ని అమలులోకి తీసుకురావడానికి తాలిబాన్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిషేధం గురించి దేశ ఇంటర్నెట్, టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్లకు తెలియజేసింది. కాగా, ఈ రెండు యాప్ లపై బ్యాన్ ప్రకటనకు ముందే తాలిబాన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం తమ దేశ పౌరులకు 23 మిలియన్లకు పైగా వెబ్‌ సైట్‌ ల యాక్సెస్‌ను బ్లాక్ చేసింది. ఈ  వెబ్‌ సైట్‌లు అనైతిక విషయాలుగా భావించే వాటిని చూపిస్తున్నాయని ఈ చర్చ తీసుకుంది.
Go Back to Shorts
Taliban
PUBG
TikTok
Afghanistan
ban

More Telugu News