సెప్టెంబ‌ర్‌లో ఇండియా టూర్‌కు ద‌క్షిణాఫ్రికా... షెడ్యూల్ ఇదిగో

south africa tour in india schedule released
  • మూడేసీ మ్యాచ్‌ల‌తో వ‌న్డే, టీ20 సిరీస్‌లు
  • సెప్టెంబ‌ర్ 28 నుంచి టీ20 సిరీస్‌
  • అక్టోబ‌ర్ 6 నుంచి మొద‌లు కానున్న వ‌న్డే సిరీస్‌
భార‌త క్రికెట్ జ‌ట్టు వ‌రుస సిరీస్‌ల‌తో బిజీబిజీగా గ‌డుపుతోంది. ఇప్ప‌టికే ఇంగ్లండ్ జ‌ట్టుతో ఆ దేశంలో వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌ను ముగించుకుని అటు నుంచి అటే వెస్టిండీస్ టూర్ వెళ్లిన భార‌త జ‌ట్టు... తాజాగా సెప్టెంబ‌ర్‌లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుతో వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌ను ఆడ‌నుంది. ఇందుకోసం ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు సెప్టెంబ‌ర్‌లో భార‌త ప‌ర్య‌ట‌న‌కు రానుంది. 

మూడేసి మ్యాచ్‌ల చొప్పున వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌ను ద‌క్షిణాఫ్రికాతో టీమిండియా ఆడ‌నుంది. సెప్టెంబ‌ర్ 28న టీ20 సిరీస్ మొద‌లు కానుండ‌గా... అక్టోబ‌ర్ 6న వన్డే సిరీస్ మొద‌లు కానుంది. అక్టోబ‌ర్ 11 నాటికి రెండు సిరీస్‌ల‌ను పూర్తి చేసుకోనున్న ద‌క్షిణాఫ్రికా త‌న ఇండియా టూర్‌ను ముగించ‌నుంది. ఈ మేర‌కు రెండు సిరీస్‌ల పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ బుధ‌వారం రాత్రి అధికారికంగా విడుద‌ల చేసింది.
Go Back to Shorts
Team India
South Africa
T20 Series
ODI Series

More Telugu News