ఐరాసలో ఖాళీ సీటులో సులేమానీ ఫొటో.. నెతన్యాహూ ప్రసంగం వేళ ఇరాన్‌ సంచలన నిరసన!

ఐరాసలో ఖాళీ సీటులో సులేమానీ ఫొటో.. నెతన్యాహూ ప్రసంగం వేళ ఇరాన్‌ సంచలన నిరసన!

Benjamin Netanyahu UN speech Iran sensational protest with Qasem Soleimani photo in empty seat
  • నెతన్యాహూ ప్రసంగానికి ఇరాన్‌ ప్రతినిధుల బహిష్కరణ
  • సీటులో సులేమానీ ఫొటో ఉంచిన ఇరాన్‌
  • 2020లో అమెరికా డ్రోన్‌ దాడిలో సులేమానీ మృతి
  • పలుదేశాల ప్రతినిధులూ సభ నుంచి బయటకు
  • నెతన్యాహూపై విమర్శలు చేసిన పలువురు నేతలు
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ ప్రసంగం ప్రారంభించగానే ఇరాన్‌ ప్రతినిధులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే తమ స్థానంలో దివంగత ఇరాన్‌ సైనిక కమాండర్‌ ఖాసీం సులేమానీ ఫొటోను ఉంచారు. న్యూయార్క్‌లో గురువారం జరిగిన 81వ ఐరాస సర్వసభ్య సమావేశంలో ఈ ఘటన జరిగింది.

సులేమానీ ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ)లోని ఖుద్స్‌ ఫోర్స్‌కు కమాండర్‌గా పనిచేశారు. ఇరాన్‌ సైనిక కార్యకలాపాలను విదేశాల్లో సమన్వయం చేసే కీలక విభాగంగా ఖుద్స్‌ ఫోర్స్‌ వ్యవహరిస్తుంది. 2020 జనవరిలో బాగ్దాద్‌ విమానాశ్రయ సమీపంలో అమెరికా డ్రోన్‌ దాడిలో సులేమానీ మరణించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ దాడికి ఆదేశాలు ఇచ్చారు.

నెతన్యాహూ ప్రసంగం మొదలవగానే ఇరాన్‌ ప్రతినిధులతో పాటు పలుదేశాల ప్రతినిధులు కూడా సభ నుంచి బయటకు వెళ్లారు. కొందరు నినాదాలు చేస్తూ, మరికొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ సభను వీడారు. నెతన్యాహూ మాత్రం బయటకు వెళ్తున్న వారిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సభలో ఇంకా ఉన్న విమర్శకులు కూడా బయటకు వెళ్లాలని కోరారు.

తన ప్రసంగంలో నెతన్యాహూ ఇరాన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇరాన్‌ అణ్వాయుధాలు అభివృద్ధి చేయకుండా అడ్డుకునేందుకే ఇజ్రాయెల్‌, అమెరికా చర్యలు చేపట్టాయని చెప్పారు. న్యూయార్క్‌ మేయర్‌ జొహ్రాన్‌ మమ్దానీతో పాటు ఇజ్రాయెల్‌ను విమర్శిస్తున్న పలువురు నేతలపై కూడా ఆయన విరుచుకుపడ్డారు.
Advertisement
Benjamin Netanyahu
Qasem Soleimani
UN General Assembly
Iran Israel Conflict
IRGC Quds Force
United Nations Protest

More Telugu News