ఆసియా గేమ్స్.. షూటింగ్‌లో భారత్‌కు డబుల్ ధమాకా.. స్వర్ణం, రజతం గెలిచిన క్రీడాకారులు
- షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్‌లో స్వర్ణం
- పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో రజత పతకం
- 19కి చేరిన మొత్తం పతకాల సంఖ్య
ఐచీ-నగోయా ఆసియా గేమ్స్‌లో ఆరో రోజు భారత్‌కు అద్భుతమైన ఆరంభం లభించింది. షూటర్లు సత్తా చాటడంతో భారత్ ఖాతాలో ఒక స్వర్ణం, ఒక రజతం చేరాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్‌లో సురుచి, కమల్‌జీత్ జోడీ పసిడి పతకాన్ని ముద్దాడింది.
పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్‌లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, నీరజ్ కుమార్, రుద్రాంక్ష్ పాటిల్‌తో కూడిన జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో దేశ పతకాల సంఖ్య 19కి చేరింది. మరోవైపు, స్వర్ణం గెలిచిన సురుచి-కమల్‌జీత్ జోడీ, క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఆసియా రికార్డును సమం చేయడం విశేషం.
ఇతర క్రీడల్లోనూ భారత్‌కు మరిన్ని పతకాలు ఖాయమయ్యాయి. టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో దియా చౌతాలే, మనుష్ షా జోడీ సెమీ ఫైనల్‌కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది. అలాగే, స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్‌లో వెటరన్ జోష్నా చినప్ప, వెలవన్ సెంథిల్‌కుమార్ జంట కూడా సెమీస్‌లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసింది.
ప్రస్తుతం అందరి దృష్టి కబడ్డీ సెమీ ఫైనల్స్‌పై ఉంది. పురుషుల, మహిళల జట్లు కీలకమైన మ్యాచ్‌లు ఆడనున్నాయి. వీటితో పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో మహిళల షాట్‌పుట్, పోల్ వాల్ట్, పురుషుల 10,000 మీటర్లు, హ్యామర్ త్రో వంటి పోటీల్లోనూ భారత అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.