ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో స్వల్ప ఊరట
- ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను రోజువారీ లావాదేవీల కోసం వాడుకోవడానికి కోర్టు అనుమతి
- ఖాతాల్లో ఉన్న రూ. 3 కోట్లను అన్‌ఫ్రీజ్ చేయడానికి అనుమతి నిరాకరణ
- తన కుటుంబాన్ని పోషించడం కష్టమవుతోందని ఇటీవల పిటిషన్ వేసిన రవి
ఐబొమ్మ పైరసీ కేసులో నిందితుడిగా ఉన్న ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు పాక్షిక ఊరట కల్పించింది. పోలీసులు ఫ్రీజ్ చేసిన అతడి బ్యాంకు ఖాతాలను ఇకపై రోజువారీ లావాదేవీల కోసం వినియోగించుకోవచ్చని కోర్టు అనుమతించింది. అయితే ఖాతాల్లో ఇప్పటికే నిల్వ ఉన్న సుమారు రూ.3 కోట్లను అన్‌ఫ్రీజ్ చేయాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. ఖాతాల ద్వారా భవిష్యత్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు సమయంలో ఫ్రీజ్ చేసిన సుమారు రూ.3 కోట్లపై ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయి.
తన బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ కావడం వల్ల కుటుంబాన్ని పోషించడం కష్టమవుతోందని పేర్కొంటూ రవి ఇటీవల నాంపల్లి 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. ఖాతాల్లో ఉన్న రూ.3 కోట్లను ఉపయోగించుకునే వీలు కల్పించాలని కోరారు. అయితే నగదును విడుదల చేయకుండా, ఖాతాల ఆపరేషన్‌కు మాత్రమే పరిమిత అనుమతినిచ్చింది. ఐబొమ్మకు సంబంధించిన ఆన్‌లైన్ సినిమా పైరసీ కేసు దర్యాప్తులో భాగంగా ఈ ఖాతాలు, అందులోని నిధులను ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే.