దీన్‌దయాళ్ ఆలోచనలే వికసిత్ భారత్‌కు దిక్సూచి: ప్రధాని మోదీ
- దీన్‌దయాళ్ జయంతి సందర్భంగా మోదీ నివాళి
- వ్యక్తి ప్రగతి సమాజ హితంతో ముడిపడి ఉండాలన్నదే దీన్‌దయాళ్ సిద్ధాంతమని వెల్లడి
- అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనేదే అంత్యోదయ లక్ష్యమని వ్యాఖ్య
స్వదేశీ భావజాలంతో దేశాభివృద్ధికి ప్రత్యేక దృక్పథాన్ని అందించిన మహనీయుడు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అని ప్రధాని మోదీ కొనియాడారు. ఆయన ప్రతిపాదించిన ఏకాత్మ మానవతావాదం, అంత్యోదయ స్ఫూర్తే బీజేపీకి, తమ ప్రభుత్వాల నిర్ణయాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. వ్యక్తి ప్రగతి సమాజం నుంచి వేరుగా కాకుండా, సమాజ హితంతో ముడిపడి ఉండాలన్నదే దీన్‌దయాళ్ సిద్ధాంత సారమని చెప్పారు. ప్రకృతిని దెబ్బతీయకుండా సమాజం పురోగమించేలా అభివృద్ధి నమూనా ఉండాలని ఆయన ఆలోచనలు చెబుతాయని వివరించారు. దీన్ దయాళ్ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ధి ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తి వరకు చేరడమే అంత్యోదయ లక్ష్యమని మోదీ గుర్తుచేశారు. ఏకాత్మ మానవతావాదాన్ని వివరిస్తూ, వ్యక్తి ఎదుగుదలతో పాటు సమాజం, ప్రకృతి, దేశం మధ్య సమతుల్యత ఉండాలని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించారని ప్రధాని పేర్కొన్నారు. కేవలం ఆర్థిక వృద్ధే అభివృద్ధి కాదని, అందులో సామాజిక సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ కూడా భాగస్వామ్యం కావాలని ఆయన భావించినట్లు తెలిపారు.
పేదల సంక్షేమం, సమాజంలోని అట్టడుగు వర్గాల సాధికారత, పర్యావరణ సమతుల్యతకు ప్రాధాన్యమిస్తూ తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని మోదీ వివరించారు. ఈ ఆలోచనల స్ఫూర్తితోనే సమగ్ర, అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యంగా ‘వికసిత్ భారత్’ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.