వైడ్ వివాదం.. టీమిండియాపై 'చీటింగ్' ఆరోపణలు.. జపాన్‌తో మ్యాచ్‌లో అసలేం జరిగింది?
- జపాన్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్ వైడ్ నిర్ణయంపై తీవ్ర వివాదం
- అంపైర్ల నిర్ణయాన్ని సమర్థించిన మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా
- రివర్స్ స్వీప్ ఆడినప్పుడు వైడ్ రూల్ భిన్నంగా ఉంటుందని వెల్లడి
- ఐసీసీ నిబంధనల ప్రకారమే అంపైర్లు నిర్ణయం తీసుకున్నారని స్పష్టీకరణ
- ఈ మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం
జపాన్‌తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో టీమిండియా రెండు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించినప్పటికీ, చివరి ఓవర్లో చోటుచేసుకున్న ఓ వైడ్ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంపైర్లు తమ నిర్ణయాన్ని మార్చుకోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తగా, భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందించి అసలు నిబంధన ఏంటో వివరించాడు. అంపైర్లు తీసుకున్న తుది నిర్ణయం ఐసీసీ నిబంధనలకు అనుగుణంగానే ఉందని స్పష్టం చేశాడు.
వర్షం కారణంగా జపాన్‌లోని సానోలో జరిగిన ఈ మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 5 ఓవర్లలో 4 వికెట్లకు 32 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో జపాన్‌కు చివరి ఓవర్లో 8 పరుగులు అవసరమయ్యాయి. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జపాన్ బ్యాటర్ అలెగ్జాండర్ షిరాయ్-పాట్మోర్ రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి అతని లెగ్ సైడ్ వైపుగా వెళ్లడంతో ఆన్-ఫీల్డ్ అంపైర్ మొదట వైడ్‌గా ప్రకటించారు.
అయితే, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, బౌలర్ అక్షర్ పటేల్ సహా భారత ఆటగాళ్లు వెంటనే అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇద్దరు అంపైర్లు చర్చించుకున్న తర్వాత తమ వైడ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో జపాన్ 3 వికెట్లకు 30 పరుగులకే పరిమితమై, కేవలం రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఈ ఘటనపై స్పందించిన ఆకాశ్ చోప్రా.. టీమిండియా ఆటగాళ్లు అంపైర్లపై ఒత్తిడి తెచ్చి 'చీటింగ్' చేసి గెలిచారంటూ వస్తున్న ఆరోపణలు అనవసర గందరగోళం సృష్టిస్తున్నాయని అన్నాడు. ప్రస్తుత ఐసీసీ నిబంధనల ప్రకారం బ్యాటర్ రివర్స్ స్వీప్ లేదా స్విచ్ హిట్ ఆడినప్పుడు, వికెట్‌కు ఇరువైపులా ఉన్న ప్రాంతాన్ని ఆఫ్ సైడ్‌గానే పరిగణిస్తారు.
అలాంటప్పుడు బంతి బయటి స్టంప్‌కు చాలా దూరంగా వెళ్తేనే వైడ్‌గా ప్రకటిస్తారు. ఈ సందర్భంలో బౌలర్‌కే అనుకూలత ఉంటుందని చోప్రా వివరించాడు. తొలుత తనకు కూడా ఈ నిబంధనపై పూర్తి అవగాహన లేదని, కానీ తర్వాత పరిశీలించాక అంపైర్లదే సరైన నిర్ణయమని అర్థమైందని అంగీకరించాడు. క్రికెట్ నిపుణులు సైతం ఈ నిర్ణయం నిబంధనల ప్రకారమే ఉందని ధ్రువీకరించారు.