వివక్ష కేసులో కంపెనీకి చుక్కలు చూపిస్తున్న మహిళా టెకీ.. పరిహారంగా రూ.9,637 కోట్ల డిమాండ్!
- వివక్ష కేసులో మహిళా టెకీకి భారీ విజయం
- రూ.9,637 కోట్ల రికార్డు పరిహారం కోసం పోరాటం
- వర్క్ ట్రిప్‌లో ఘటన తర్వాత ఉద్యోగం నుంచి తొలగింపు
- ఆమె క్లెయిమ్ అసాధారణమన్న కంపెనీ
- నిపుణుల సాక్ష్యం లేకుండా విలువను తోసిపుచ్చలేమన్న ట్రైబ్యునల్
బ్రిటన్‌లో ఓ వివక్ష కేసులో సంచలనం చోటుచేసుకుంది. ఓ టెక్ కంపెనీలో ఉన్నత పదవి నుంచి తొలగించబడిన మహిళ, పరిహారంగా ఏకంగా రూ.9,637 కోట్లు (900 మిలియన్ పౌండ్లు) పొందేందుకు న్యాయపోరాటంలో కీలక విజయం సాధించారు. ఒకవేళ ఈ మొత్తం ఆమెకు దక్కితే, బ్రిటిష్ ఉపాధి ట్రైబ్యునల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద పరిహారం అవుతుంది.
వివరాల్లోకి వెళితే.. ఏడీహెచ్‌డీ సమస్యతో బాధపడుతున్న షానన్ బర్న్స్.. 'గిట్‌పాడ్' అనే సంస్థలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజనీరింగ్‌గా పనిచేసేవారు. 2023 ఏప్రిల్‌లో ఆస్ట్రియాలోని లోఫర్‌లో జరిగిన టీమ్-బిల్డింగ్ ఈవెంట్‌లో ఓ ఘటన జరిగింది. ఆ పర్యటనలో ఆమె మద్యం సేవించి, గది తాళం మరిచిపోవడంతో బయటే ఉండిపోయారు.
ఆ రాత్రి ఆమె సౌనాలోనే నిద్రించాల్సి వచ్చింది. ఈ ఘటన తర్వాత కంపెనీ సీఈఓ జోహన్నెస్ లాండ్‌గ్రాఫ్, ఆమెలో వృత్తిపరమైన బాధ్యత లోపించిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2023 జూన్ లో షానన్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు.
దీంతో షానన్ బర్న్స్ న్యాయపోరాటానికి దిగారు. తనకున్న ఆరోగ్య సమస్య (వికలాంగత) కారణంగానే తనను వివక్షతో తొలగించారని ఆరోపిస్తూ బర్మింగ్‌హామ్ ఉపాధి ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్.. 2025లో షానన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమె తొలగింపు వికలాంగత వివక్ష కిందకే వస్తుందని స్పష్టం చేసింది.
ఈ తీర్పుతో ఆమె భవిష్యత్తులో కోల్పోయిన జీతం, కంపెనీ ఈక్విటీ వంటి వాటిని లెక్కగట్టి సుమారు రూ.9,637 కోట్ల భారీ పరిహారం కోసం క్లెయిమ్ దాఖలు చేశారు. అయితే, గిట్‌పాడ్ కంపెనీ ఈ క్లెయిమ్‌ను అసాధారణం, నమ్మశక్యం కానిదని అభివర్ణించింది. పరిహారాన్ని రూ.12.68 కోట్లకు పరిమితం చేయాలని వాదిస్తూ పిటిషన్ వేసింది.
ఈ అభ్యర్థనను ఎంప్లాయ్‌మెంట్ జడ్జి రాచెల్ వెడ్డర్‌స్పూన్ తోసిపుచ్చారు. షానన్ బర్న్స్‌కు అత్యధిక వేతన చరిత్ర ఉందని, ఆమె క్లెయిమ్‌లో జీతంతో పాటు కంపెనీ ఈక్విటీ నష్టాలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. గిట్‌పాడ్‌లో ఆమెకు 0.85 శాతం వాటా ఉందని, ఒకవేళ ఓపెన్ఏఐ లాంటి సంస్థ గిట్‌పాడ్‌ను కొనుగోలు చేస్తే ఆ షేర్ల విలువ కొన్ని సంవత్సరాల్లో రూ.267 కోట్లకు చేరే అవకాశం ఉందని ట్రిబ్యునల్ అంచనా వేసింది.
నిపుణుల సాక్ష్యం లేకుండా షానన్ క్లెయిమ్ విలువను తక్కువగా అంచనా వేయలేమని స్పష్టం చేసింది. ఈ ఘటన తర్వాత షానన్ టెక్ పరిశ్రమను విడిచిపెట్టి, ప్రస్తుతం థెరపిస్ట్‌గా మారేందుకు శిక్షణ తీసుకుంటున్నారు.