యూపీఐ లావాదేవీలపై చార్జీలు.. వినియోగదారులకు భారం లేదన్న నిర్మలా సీతారామన్
- ఎండీఆర్ చార్జీలపై వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న నిర్మల
- ఈ చార్జీలు కేవలం వ్యాపారులకు మాత్రమే పరిమితమని స్పష్టీకరణ
- నిబంధనలపై అవగాహన లోపం వల్లే అపోహలు వ్యాపిస్తున్నాయని వ్యాఖ్య
యూపీఐ డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) చార్జీలు విధించనున్నారనే ప్రచారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. ఈ అంశంతో సాధారణ ఖాతాదారులు లేదా వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి జేబుపై ఎలాంటి అదనపు భారం పడదని తెలిపారు. రూ.2,000కు మించిన కొన్ని నిర్దిష్ట డిజిటల్ లావాదేవీలకు ఎండీఆర్ వర్తించినా, అది వినియోగదారులకు కాదని, వ్యాపారులకే పరిమితమని మంత్రి చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ మేరకు స్పష్టతనిచ్చారు.
ఎండీఆర్ అనేది కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్ను, సెస్ లేదా సర్‌చార్జ్ కాదని... ఆ మొత్తం ప్రభుత్వ ఖజానాకు వెళ్లదని స్పష్టం చేశారు. బ్యాంకులు, పేమెంట్ గేట్‌వేలు వంటి డిజిటల్ చెల్లింపు వ్యవస్థ నిర్వహణకు సంబంధించిన ఖర్చుల కోసం ఈ రుసుము ఉంటుందని వివరించారు. ఎండీఆర్ నిబంధనలపై అవగాహన లోపం వల్లే అనవసర అపోహలు వ్యాపిస్తున్నాయని అన్నారు. ఇప్పటికే డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే చెల్లింపుల్లో వ్యాపారులు ఇలాంటి రుసుములను భరిస్తున్నారని గుర్తుచేశారు. యూపీఐ చెల్లింపుల విషయంలోనూ ఈ చార్జీని కస్టమర్లపైకి నెట్టే అవకాశం ఉండదని మంత్రి తేల్చిచెప్పారు.
డిజిటల్ చెల్లింపులను ఉపయోగించే ప్రజలకు సేవలు ఉచితంగానే, ఎప్పటిలాగే అంతరాయం లేకుండా అందుబాటులో ఉంటాయని తెలిపారు. తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు గందరగోళానికి గురికావొద్దని సూచించిన ఆమె, ఎండీఆర్ ద్వారా వసూలయ్యే సొమ్ము డిజిటల్ పేమెంట్ నెట్‌వర్క్ నిర్వహణలో భాగస్వామ్యమైన బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థల వ్యవస్థాపక వ్యయాలకే ఉపయోగపడుతుందని వివరించారు.