పుట్టినరోజునే నరకం.. దిల్లీ పార్కులో బాలికపై సామూహిక అత్యాచారం!

పుట్టినరోజునే నరకం.. దిల్లీ పార్కులో బాలికపై సామూహిక అత్యాచారం!

Delhi Gang Rape of minor girl in Astha Kunj Park on her birthday
  • పుట్టినరోజున స్నేహితుడితో పార్కుకు వెళ్లిన బాలిక 
  • పోలీసులమని నమ్మించి, తుపాకీతో బెదిరించి అఘాయిత్యం
  • ఘటన జరిగిన 12 గంటల్లోపే నిందితులైన లాయర్, వ్యాపారి, విద్యార్థి అరెస్ట్
  • ప్రధాన నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసుల కాల్పులు, కాలికి గాయం
‘‘మేం పోలీసులం... పార్కులో ఎందుకు కూర్చున్నారు?’ అంటూ మా దగ్గరకు వచ్చారు. నా స్నేహితుడిని చితకబాది, తుపాకీ చూపించి నన్ను పొదల్లోకి లాక్కెళ్లారు. ఒకరి తర్వాత ఒకరు నాపై అత్యాచారానికి పాల్పడ్డారు...’’ పుట్టినరోజున జరిగిన ఈ దారుణాన్ని తలచుకుంటూ పోలీసుల ఎదుట కన్నీరుమున్నీరైంది 17 ఏళ్ల బాలిక. దేశ రాజధాని దిల్లీలోని ఆస్థా కుంజ్ పార్కులో సోమవారం రాత్రి ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన పోలీసులు, కేవలం 12 గంటల్లోనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

ఫరీదాబాద్‌కు చెందిన విద్యార్థిని (17), సోమవారం తన పుట్టినరోజు కావడంతో స్నేహితుడితో కలిసి సాయంత్రం కల్కాజీ మందిరానికి వచ్చింది. దర్శనం అనంతరం, సమీపంలోని ఆస్థా కుంజ్ పార్కులో ఒక బెంచీపై కూర్చుని మాట్లాడుకుంటున్నారు. రాత్రి 7:30 గంటల సమయంలో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు, తాము పోలీసులమని పరిచయం చేసుకున్నారు. ‘‘మైనర్లు ఇలా పార్కులో ఉండటం నేరం, మీ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తాం’’ అని బెదిరించారు.

ఆ తర్వాత వారి అసలు స్వరూపం బయటపెట్టారు. బాలిక స్నేహితుడిపై దాడి చేసి, ఆమెను బలవంతంగా సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లారు. అక్కడ తుపాకీతో బెదిరించి ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారానికి ఒడిగట్టారని బాధితురాలు తన ఫిర్యాదులో కన్నీటిపర్యంతమైంది. ఈ నరకం నుంచి బయటపడిన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలి ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం 12 గంటల్లోనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని ఆసిఫ్ (కూరగాయల వ్యాపారి), హేమంత్ (లాయర్), అతడి సోదరుడు ముకేశ్ (బీఎస్సీ విద్యార్థి)గా గుర్తించారు. ప్రధాన నిందితుడైన ఆసిఫ్‌ను పట్టుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడి కాలికి గాయమైంది. నిందితులపై పోక్సో చట్టంతో పాటు బీఎన్ఎస్ సెక్షన్ల కింద గ్యాంగ్ రేప్, కుట్ర, దాడి వంటి కఠినమైన కేసులు నమోదు చేసి, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
Advertisement
Delhi Gang Rape
Astha Kunj Park
Minor Girl Birthday Assault
Delhi Police Encounter
Kalkaji Mandir Park Incident
POCSO Act Delhi

More Telugu News