రూ.39 లక్షలకు బాలాపూర్ లడ్డూ.. ఈసారి అదృష్టం ఎవరిని వరించిందంటే..!
- ముగిసిన బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం
- దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి
- ఈసారి వేలంలో 9 మంది
- పోటీపోటీగా పెరిగిన బిడ్లు
- లడ్డూను దక్కించుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయనే నమ్మకం
హైదరాబాద్ వినాయక ఉత్సవాల్లో ఎంతో ప్రత్యేకమైన బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట ముగిసింది. ఈసారి లడ్డూకు భారీ ధర పలికింది. సాహెబ్‌నగర్‌కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి రూ.39 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. దీంతో బాలాపూర్ లడ్డూ వేలంలో కొత్త రికార్డు నమోదైంది.
ప్రతి ఏడాది బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపై భక్తుల్లో భారీ ఆసక్తి ఉంటుంది. ఈసారి కూడా లడ్డూను దక్కించుకునేందుకు 9 మంది భక్తులు వేలంలో పాల్గొన్నారు. ఒకరిని మించి మరొకరు బిడ్ పెంచడంతో వేలం ఉత్కంఠగా సాగింది. చివరికి రూ.39 లక్షల వద్ద సామ ప్రణీత్ రెడ్డి లడ్డూను సొంతం చేసుకున్నారు.
లడ్డూను దక్కించుకున్న ప్రణీత్ రెడ్డిని ఉత్సవ నిర్వాహకులు, తోటి భక్తులు అభినందించారు. బాలాపూర్ గణేశుడి లడ్డూను దక్కించుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయనే నమ్మకం భక్తుల్లో ఉంది. దీంతో ప్రతి ఏడాది ఈ లడ్డూకు వేలంలో భారీ పోటీ నెలకొంటోంది.