టీమిండియాకు కొత్త టైటిల్ స్పాన్సర్.. ఒక్కో మ్యాచ్‌కు రూ. 4.85 కోట్లతో బీసీసీఐ భారీ డీల్
- టీమిండియా స్వదేశీ మ్యాచ్‌లకు కొత్త టైటిల్ స్పాన్సర్‌గా ముత్తూట్ ఫిన్‌కార్ప్
- రాబోయే రెండేళ్ల పాటు కొనసాగనున్న ఈ ఒప్పందం
- ఒక్కో మ్యాచ్‌కు రూ. 4.85 కోట్ల బేస్ ప్రైస్‌తో డీల్ ఖరారు
- వెస్టిండీస్‌తో సిరీస్‌కు ముందు ఈ ఒప్పందం చేసుకున్న బీసీసీఐ
బీసీసీఐ స్వదేశంలో జరిగే మ్యాచ్‌లకు సంబంధించి కొత్త టైటిల్ స్పాన్సర్‌ను ఖరారు చేసింది. ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థ ముత్తూట్ ఫిన్‌కార్ప్‌తో రాబోయే రెండేళ్ల హోమ్ సీజన్ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. వెస్టిండీస్‌తో స్వదేశీ సిరీస్ ప్రారంభానికి కేవలం రెండు రోజుల ముందు ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఒక్కో మ్యాచ్‌కు రూ. 4.85 కోట్ల బేస్ ప్రైస్‌తో బీసీసీఐ ఈ డీల్‌ను ఖరారు చేసింది. అయితే, ఈ స్పాన్సర్షిప్ కోసం నిర్ణయించిన అధిక కనీస ధర కారణంగా ఇతర బిడ్డర్ల నుంచి పెద్దగా ఆసక్తి రాలేదని సమాచారం. దీంతో ముత్తూట్ ఫిన్‌కార్ప్ ఈ హక్కులను దక్కించుకుంది.
భారత్, వెస్టిండీస్ మధ్య ఈ నెల 27 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20లు జరగనున్నాయి. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో తొలి వన్డే జరగనుండగా, సెప్టెంబర్ 30, అక్టోబర్ 3 తేదీల్లో మిగిలిన వన్డేలు జరుగుతాయి.
అనంతరం అక్టోబర్ 6 నుంచి 17 వరకు టీ20 సిరీస్ జరగనుంది. ఇకపై స్వదేశంలో జరిగే అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లకు ముత్తూట్ ఫిన్‌కార్ప్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.