చంద్రబాబు వల్లే పోలవరం ప్రాజక్టుకు ఈ గతి పట్టింది: జగన్
- కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నారు
- స్పిల్ వే పూర్తి చేయకుండానే కాఫర్ డ్యామ్ కట్టారు
- అన్ని సమస్యలను అధిగమించి పోలవరంను పూర్తి చేస్తామన్న సీఎం
స్పిల్ వే పూర్తి చేయకుండానే కాఫర్ డ్యామ్ కట్టారని జగన్ విమర్శించారు. మధ్యలో మూడు పెద్ద ఖాళీలను వదిలిపెట్టారని... ఈ నిర్లక్ష్యం వల్లే నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరిగిందని చెప్పారు. పునాదిపైన, లోపల కలిపి 35.6 మీటర్ల మేర గుంత ఏర్పడిందని తెలిపారు. చంద్రబాబు తప్పిదాలతోనే పోలవరంకు ఈ గతి పట్టిందని అన్నారు. అన్ని సమస్యలను అధిగమించి పోలవరంను పూర్తి చేసి తీరుతామని చెప్పారు.