Karate Kalyani: సినీ నటి కరాటే కల్యాణిపై కేసు నమోదు

Police case filed against Karate Kalyani
షార్ట్స్‌లో చూడండి
సినీ నటి కరాటే కల్యాణిపై పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, గతంలో సైదాబాద్ సింగరేణి కాలనీలో ఓ బాలికపై హత్యాచారం జరిగింది. ఈ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. హత్యాచారానికి పాల్పడిన నిందితుడు చివరకు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇదిలావుంచితే, చట్టప్రకారం అత్యాచారానికి గురైన బాధితుల వివరాలను బయటపెట్టకూడదు. అయితే, ఆ వివరాలను కల్యాణి బయటపెట్టారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కోర్టులో జగద్గిరిగుట్ట వాసి నితీశ్ పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఆమెపై జగద్గిరిగుట్ట పీఎస్ లో కేసు నమోదైంది.
Go Back to Shorts
Karate Kalyani
Tollywood
Police Case

More Telugu News