పాకిస్థాన్ లో చరిత్ర సృష్టించిన హిందూ యువతి

Hindu woman creates history in Pakistan
  • చరిత్ర సృష్టించిన సనా రాంచంద్ గుల్వానీ
  • పాకిస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు ఎంపిక
  • తొలి అటెంప్ట్ లోనే సివిల్స్ కొట్టిన హిందూ యువతి
పాకిస్థాన్ లో హిందూ యువతి చరిత్ర సృష్టించారు. సనా రాంచంద్ గుల్వానీ పాక్ లో అత్యున్నత ఉద్యోగమైన పాకిస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు ఎంపికయ్యారు. ఈ ఉద్యోగాన్ని తన తొలి అటెంప్ట్ లోనే ఆమె సాధించడం గమనార్హం. పాకిస్థాన్ లో హిందువులు మైనార్టీలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ దేశంలో అత్యున్నత ఉద్యోగాల్లోకి మైనార్టీలు వెళ్లడం అత్యంత కష్టం.

ఈ సందర్భంగా సనా రాంచంద్ మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు అడుగు వేసినప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని చెప్పారు. ఈ ఏడాది జరిగిన సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ పరీక్షల్లో దేశ వ్యాప్తంగా కేవలం 2 శాతం అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారు. మరోవైపు సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన ఆమె ఇప్పుడు పాకిస్థాన్ లోని హిందువులకు రోల్ మోడల్ గా మారారు.
Go Back to Shorts
Pakistan
Hindu Woman
Administrative Service
Sana Ramchand Gulwani

More Telugu News