ఏపీలో 18 ఏళ్లు నిండిన వారికి జూన్ నుంచి వ్యాక్సినేషన్
- టీకా పంపిణీ కోసం కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాం
- రిజిస్ట్రేషన్ సమయాన్ని త్వరలో ప్రకటిస్తాం
- 11,453 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ప్రైవేటు ఆసుపత్రులకు అందించాం
కొవిడ్ చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ప్రైవేటు ఆసుపత్రులకు అందిస్తామని సింఘాల్ తెలిపారు. వాటిని బ్లాక్ మార్కెట్లో విక్రయించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. నిన్న 11,453 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేసినట్టు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో 32,810 ఇంజక్షన్లు ఉన్నట్టు చెప్పారు. 4 లక్షల ఇంజక్షన్లకు ఆర్డర్ ఇచ్చామని, ఈ వారంలో మరో 50 వేలు వస్తాయని సింఘాల్ వివరించారు.