Chandrababu: చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తూ చిరంజీవి 'బర్త్ డే' ట్వీట్!

  • నేడు చంద్రబాబు 70వ పుట్టినరోజు
  • దశాబ్దాలుగా ప్రజాసేవలో కొనసాగుతున్నారంటూ చిరంజీవి ప్రశంస
  • మీ దూరదృష్టి, అంకితభావం అత్యున్నతమైనవి అంటూ కితాబు
Chiranjeevi praises Chandrababu in his birthday wish

టీడీపీ అధినేత చంద్రబాబు 70వ జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి శుభాభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి కూడా శుభాకాంక్షలు తెలిపారు.

'దశాబ్దాలుగా అహర్నిశం ప్రజా సేవలో కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ భగవంతుడిని కోరుతున్నాను. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సర్. మీ దూరదృష్టి, కష్టపడే మనస్తత్వం, అంకితభావం అత్యున్నతమైనవి' అని చిరంజీవి ట్వీట్ చేశారు. దీంతో పాటు గతంలో చంద్రబాబుతో ఓ వేడుక సందర్భంగా సరదాగా గడిపిన ఒక ఫోటోను షేర్ చేశారు.

More Telugu News