దానం నాగేందర్‌పై కోర్టు తీర్పు... కేసీఆర్‌కు చెంపపెట్టు అన్న మహేశ్ కుమార్ గౌడ్

దానం నాగేందర్‌పై కోర్టు తీర్పు... కేసీఆర్‌కు చెంపపెట్టు అన్న మహేశ్ కుమార్ గౌడ్

Danam Nagender court verdict is a slap to KCR says Mahesh Kumar Goud
  • తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆరేనని విమర్శ
  • ప్రభుత్వాలను కూల్చివేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆగ్రహం
  • దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ నాశనం చేస్తోందని మండిపాటు
  • ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్‌దేనని ధీమా
దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్, కేసీఆర్‌కు చెంపపెట్టు లాంటిదని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల దుష్ట సంస్కృతిని ప్రవేశపెట్టిందే కేసీఆర్ అని తీవ్రంగా విమర్శించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, ఎన్నిక జరిగితే ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్‌దేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

"గతంలో టీడీపీ టికెట్‌పై గెలిచిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను, కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన సబిత ఇంద్రారెడ్డిని బీఆర్ఎస్‌లో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చింది కేసీఆర్‌ కాదా?" అని ప్రశ్నించారు. కేసీఆర్ చర్యల వల్లే రాష్ట్రంలో ఫిరాయింపుల సంస్కృతి పెరిగిపోయిందని ఆరోపించారు.

అదే సమయంలో బీజేపీపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాలను కూల్చివేయడం, పార్టీలను చీల్చడం బీజేపీకి అలవాటని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ నాశనం చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్‌, బీజేపీ ఇద్దరూ ఒకే తరహా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
Advertisement
Mahesh Kumar Goud
Danam Nagender
KCR
Telangana High Court
Party Defections
Khairatabad Assembly

More Telugu News