విశాఖలో 'పేదలకు పట్టాభిషేకం'.. లబ్ధిదారులకు ఆస్తి హక్కు పత్రాలు అందించిన సీఎం చంద్రబాబు
- విశాఖలో 'పేదలకు పట్టాభిషేకం' కార్యక్రమం
- 28,445 కుటుంబాలకు ఇంటి పట్టాలు పంపిణీ
- పేదల ఇళ్ల కోసం 399 ఎకరాల భూమి క్రమబద్ధీకరణ
- పట్టాలు అందించి ర్యాంప్ వాక్‌తో అలరించిన సీఎం చంద్రబాబు
- పంపిణీ చేసిన ఆస్తుల విలువ రూ.8,874 కోట్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో 'పేదలకు పట్టాభిషేకం' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలాది నిరుపేద కుటుంబాలకు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఇంటి స్థలాల పట్టాలను (ఆస్తి హక్కు పత్రాలు) ఆయన స్వయంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా నగరంలోని 28,445 కుటుంబాలకు వారి సొంతింటి కల సాకారమైంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఇళ్ల స్థలాల కోసం 399 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించింది. ఈ క్రమబద్ధీకరించిన స్థలాలకు సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు అందించారు. పంపిణీ చేసిన ఈ ఆస్తుల మొత్తం విలువ సుమారు రూ.8,874 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కార్యక్రమం నగరంలో పండగ వాతావరణాన్ని తలపించింది.
అంతకుముందు, ఇవాళ విశాఖపట్నం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. పట్టాల పంపిణీ కార్యక్రమం అనంతరం చంద్రబాబు లబ్ధిదారులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. వేదికపై ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై నడుస్తూ ఆయన లబ్ధిదారులను, సభకు హాజరైన వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాటు పలువురు కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. దశాబ్దాలుగా ఉన్న తమ సమస్యకు పరిష్కారం లభించడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.