నా లుక్ కొత్తగా ఉండడానికి కారణం ఈ కథే: కేరళలో నాని 'ప్యారడైజ్' ప్రమోషన్స్
- 'ప్యారడైజ్' నా కెరీర్‌లోనే చాలా స్పెషల్ సినిమా అన్న నాని
- మమ్ముట్టి గారు ఎమోషనల్‌గా ఫోన్ చేశారని వెల్లడి
- మలయాళ చిత్ర పరిశ్రమ నాణ్యతను ప్రశంసించిన హీరో
- 'ప్యారడైజ్' చిత్రానికి ట్రైలర్ విడుదల చేయడం లేదని స్పష్టం
- కొత్త ప్రతిభను ప్రోత్సహించడమే నాకు అసలైన అవార్డు అని వ్యాఖ్య
నేచురల్ స్టార్ నాని తన తాజా చిత్రం 'ప్యారడైజ్' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కేరళలో పర్యటించారు. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రెస్‌మీట్‌లో నాని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన కెరీర్‌లోనే ఇది అత్యంత ప్రత్యేకమైన చిత్రమని, మునుపెన్నడూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా మలయాళ చిత్ర పరిశ్రమపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ కథానాయికగా నటించగా, సీనియర్ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు.
'ప్యారడైజ్' సినిమా విశేషాల గురించి నాని మాట్లాడుతూ, "ఈ సినిమా ఆర్ట్ ఫిల్మ్, కమర్షియల్ ఫిల్మ్‌లకు సరైన మిశ్రమంలా ఉంటుంది. మలయాళ సినిమాల్లో ఉండే లోతైన భావోద్వేగాలు, తెలుగు ప్రేక్షకులు ఇష్టపడే థియేట్రికల్ మూమెంట్స్ రెండూ ఇందులో ఉంటాయి. నా కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన చిత్రాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇందులో రానెస్, ఇంటెన్సిటీ చాలా ఎక్కువ. నా లుక్ కూడా కొత్తగా ఉండటానికి కారణం ఈ కథే" అని వివరించారు.
ఈ చిత్రానికి 'A' సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉందని, అయితే త్వరలోనే కుటుంబ ప్రేక్షకుల కోసం మంచి సినిమాలు చేస్తానని హామీ ఇచ్చారు. నటుడిగా అన్ని రకాల జానర్లలో నటించాలనుకుంటున్నానని, త్వరలో 'భలే భలే మగాడివోయ్' తరహా సినిమా కూడా చేస్తానని అన్నారు.
ఈ చిత్రానికి ట్రైలర్ విడుదల చేయకపోవడంపై నాని స్పందించారు. "ప్రేక్షకులకు థియేటర్లలోనే పూర్తి సర్‌ప్రైజ్ ఇవ్వాలన్నది మా ఉద్దేశం. అందుకే ట్రైలర్ విడుదల చేయడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా జరుగుతున్నాయి. ఈ సినిమాలోని అనేక ఆశ్చర్యకరమైన అంశాలను ప్రేక్షకులు థియేటర్లలోనే అనుభూతి చెందాలి" అని పేర్కొన్నారు.
కేరళతో తనకున్న అనుబంధాన్ని, మలయాళ నటులతో స్నేహాన్ని నాని గుర్తుచేసుకున్నారు. "దుల్కర్ సల్మాన్ నాకు మంచి స్నేహితుడు. ఆయన ఎంచుకునే పాత్రలు నాకెంతో ఇష్టం. ఇక రెండు రోజుల క్రితం మమ్ముట్టి గారు చాలా ఎమోషనల్‌గా ఫోన్ చేశారు. ఆయన ప్రేమకైనా, కోపానికైనా ఫిల్టర్లు ఉండవు. తన మనవళ్లు ఈ సినిమా చూడొద్దని చెప్పానన్నారు" అని నాని వెల్లడించారు. మలయాళ చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ, "తక్కువ వనరులతో అద్భుతమైన నాణ్యతతో సినిమాలు తీయడంలో వారు ముందుంటారు. వారి నుంచి ప్రతి పరిశ్రమ నేర్చుకోవాల్సింది చాలా ఉంది" అని కొనియాడారు.
సినిమా పరిశ్రమలోకి వచ్చి 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, "నేను పరిచయం చేసిన శ్రీకాంత్ ఓదెల, నాగ్ అశ్విన్ వంటి దర్శకులు తమను తాము నిరూపించుకోవడం గర్వంగా ఉంది. ఎన్ని బ్లాక్‌బస్టర్లు కొట్టినా, కొత్త ప్రతిభను ప్రోత్సహించడమే నా అతిపెద్ద అవార్డుగా భావిస్తాను" అని నాని తన మనసులోని మాటను పంచుకున్నారు.