విజయ్ ఫోన్‌తో ఆశ్చర్యపోయా.. ఆయన చాలా సింపుల్: విజయ్ సేతుపతి
- విజయ్ కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో ఆయన కాల్ చేశారని వెల్లడి
- విజయ్ చాలా నిరాడంబరంగా ఉంటాడన్న సేతుపతి
- జన నాయగన్ సెట్స్‌పై చూసినప్పుడు క్యూట్‌గా కనిపించారని వ్యాఖ్య
తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్‌తో తనకున్న అనుబంధం గురించి నటుడు విజయ్ సేతుపతి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. విజయ్ నిరాడంబరత తనను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ జన్మదినం సందర్భంగా తాను శుభాకాంక్షలు తెలియజేశానని, ఆ తర్వాత ఊహించని విధంగా విజయ్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని సేతుపతి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
"ప్రియ మిత్రమా" అంటూ విజయ్ తనతో మాట్లాడారని, తన కుమారుడికి విషెస్ చెప్పినందుకు ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారని విజయ్ సేతుపతి తెలిపారు. అగ్ర నటుడైనప్పటికీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయన అన్నారు. ఈ స్థాయికి చేరుకున్నా విజయ్ ఎంతో నిరాడంబరంగా ఉంటారని ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో 'జన నాయగన్' చిత్ర సెట్స్‌లో విజయ్‌ను చూశానని, అప్పుడు ఆయన ఎంతో ఆకర్షణీయంగా కనిపించారని తన పాత జ్ఞాపకాలను పంచుకున్నారు.