పాకిస్థాన్ గగనతలాన్ని వాడద్దు.. తమ విమానయాన సంస్థలకు అమెరికా నోటీసులు!
- పాక్ మీదుగా వెళ్లవద్దు
- 'నోటామ్'ను జారీ చేసిన ఎఫ్ఏఏ
- అన్ని సంస్థలకూ వర్తిస్తుందని వెల్లడి
యూఎస్ పౌర విమానయాన కార్యకలాపాలకు పాకిస్థాన్ గగనతలంపై అవాంతరాలు ఏర్పడవచ్చని భావించిన మీదటే ఎఫ్ఏఏ, 'నోటామ్' (నోటీస్ టూ ఎయిర్ మ్యాన్) జారీ చేసిందని అమెరికా అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 30వ తేదీతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది అన్ని యూఎస్ కేంద్రంగా నడిచే విమానయాన సంస్థలకు, పైలెట్లకూ వర్తిస్తుందని పేర్కొంది.