'లక్ష్మీస్ ఎన్టీఆర్', వర్మ, లక్ష్మీపార్వతిపై చంద్రబాబు స్పందన
- రోడ్డు మీద కాకపోతే ఈసీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టుకోమనండి
- ఆవిడ ఇప్పుడు ఎక్కడుంది?
- ఇదేమైనా కొత్త సినిమానా? తెలంగాణలో రిలీజ్ అయింది కదా
తన పోరాటమంతా ప్రధాని మోదీపైనే అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇచ్చి ఉంటే... ఆయనను నిలదీయాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. ఇక్కడ పెద్దపెద్ద మాటలు మాట్లాడేవారెవరైనా ఢిల్లీకి వెళ్లి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. గుజరాత్, తెలంగాణల కంటే ఏపీలోనే అభివృద్ధి ఎక్కువగా ఉందని అన్నారు.