50MP సెల్ఫీ కెమెరా, 8,000mAh బ్యాటరీ.. ఒప్పో నుంచి రెండు కొత్త 5G ఫోన్లు
- ఒప్పో ఎఫ్35 సిరీస్‌లో రెండు కొత్త 5జీ ఫోన్లు
- ధర రూ.38,999 నుంచి ప్రారంభం
- 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- ప్రో మోడల్‌లో 144Hz అమోలెడ్ డిస్‌ప్లే
- ఈ నెలలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో విక్రయం
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో భారత్‌లో ‘ఎఫ్’ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో ఎఫ్35 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్35 5జీ పేర్లతో వీటిని సోమవారం మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. భారత్‌లో ఒప్పో ‘ఎఫ్’ సిరీస్ ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. రెండు ఫోన్లలోనూ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి.
ఒప్పో ఎఫ్35 5జీ ధర 6జీబీ+128జీబీ వేరియంట్‌కు రూ.38,999గా నిర్ణయించారు. 8జీబీ+128జీబీ మోడల్ ధర రూ.42,999. ఒప్పో ఎఫ్35 ప్రో 5జీ ధర 6జీబీ+128జీబీ మోడల్ ధర రూ.45,999 నుంచి మొదలవుతుంది. 8జీబీ+128జీబీ ధర రూ.49,999 కాగా.. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.54,999. కొనుగోలుపై 10 శాతం ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, 10 శాతం ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ నెలలోనే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్‌లో ఫోన్లు విక్రయానికి రానున్నాయి. ఎఫ్35 ప్రో 5జీ సన్‌సెట్ ఆరెంజ్, ట్విలైట్ బ్రౌన్, వేవ్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఎఫ్35 5జీ మిస్ట్ పింక్, టైటానియం గ్రే, వేవ్ బ్లూ రంగుల్లో వస్తుంది.
ఎఫ్35 ప్రో 5జీలో 6.78 అంగుళాల 1.5కే అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఎఫ్35 5జీలో 6.57 అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ అమోలెడ్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. రెండు ఫోన్లకు ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69కే రేటింగ్స్ ఉన్నాయి.
ప్రో మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 మ్యాక్స్ చిప్‌సెట్, స్టాండర్డ్ మోడల్‌లో డైమెన్సిటీ 6360 మ్యాక్స్ ప్రాసెసర్ ఇచ్చారు. వెనుక 50MP మెయిన్ కెమెరా ఉంది. ప్రోలో 8MP అల్ట్రావైడ్ కెమెరా, డ్యూయల్ యాక్సిస్ ఓఐఎస్ కూడా ఉన్నాయి. ఎఫ్35 5జీలో 2MP మోనోక్రోమ్ కెమెరా ఉంటుంది. రెండు ఫోన్లలోనూ 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.
ఇక బ్యాటరీ విషయంలో రెండు మోడళ్లలోనూ 8,000mAh బ్యాటరీ ఇచ్చారు. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌ఓఎస్ 16.5తో ఫోన్లు పనిచేస్తాయి. 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్-సీ, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.