లండన్-షికాగో విమానంలో ఎమర్జెన్సీ.. నిమిషాల్లో 28,000 అడుగులు కిందకు
- బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో ఎమర్జెన్సీ
- ఐర్లాండ్ మీదుగా వెళుతుండగా ఘటన
- 7700 ఎమర్జెన్సీ కోడ్ యాక్టివేట్
- విమానాన్ని 9,000 అడుగులకు దించిన వైనం
- కారణం ఇంకా వెల్లడించని బ్రిటిష్ ఎయిర్‌వేస్
లండన్ నుంచి అమెరికాలోని షికాగోకు వెళుతున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో సోమవారం అత్యవసర పరిస్థితి తలెత్తింది. ఐర్లాండ్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానం ఎమర్జెన్సీ ప్రకటించింది. వెంటనే పైలట్లు 7700 ఎమర్జెన్సీ కోడ్‌ను యాక్టివేట్ చేసి.. విమానాన్ని 37,000 నుంచి సుమారు 9,000 అడుగుల కిందకు దించారు. నిమిషాల్లో ఏకంగా 28,000 అడుగులు కిందకు రావడం గమనార్హం.
ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్24 ప్రకారం.. బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం బీఏ295 అట్లాంటిక్ మీదుగా ప్రయాణిస్తుండగా ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది. బోయింగ్ విమానం ఒక్కసారిగా కిందికి దిగడం, ఎమర్జెన్సీ కోడ్ పంపడంతో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.
7700 కోడ్‌ను విమాన సిబ్బంది సాధారణ అత్యవసర పరిస్థితిని సూచించేందుకు ఉపయోగిస్తారు. ఈ కోడ్ వచ్చినప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి విమానానికి ప్రాధాన్య సహాయం అందుతుంది. అయితే అత్యవసర పరిస్థితికి కారణం ఏంటో ఈ కోడ్ ద్వారా తెలియదు. సాంకేతిక సమస్య, ప్రయాణికుడికి వైద్య అత్యవసర పరిస్థితి లేదా ఇతర కారణాలతోనూ ఈ కోడ్‌ను ఉపయోగించవచ్చు.
బీఏ295 ఘటనకు అసలు కారణాన్ని బ్రిటిష్ ఎయిర్‌వేస్ వెంటనే వెల్లడించలేదు. విమానం పరిస్థితి, ఆ తర్వాతి ప్రయాణ మార్గంపై మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.
ఇటీవల ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్1073లో జరిగిన ఘటన తర్వాత మరో విమానం ఎమర్జెన్సీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అయితే బీఏ295 ఘటనకు, ఫ్లైదుబాయ్ ఘటనకు సంబంధం ఉన్నట్లు ప్రస్తుతానికి ఆధారాలు లేవు.
సెప్టెంబర్ 30న ఎఫ్‌జెడ్1073 విమానంలో కాక్‌పిట్‌లో గొడవ జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో 7700తో పాటు 7500 కోడ్‌ను కూడా యాక్టివేట్ చేశారు. 7500 కోడ్‌ను విమానంలో చట్టవిరుద్ధ జోక్యం లేదా హైజాక్ పరిస్థితిని సూచించేందుకు ఉపయోగిస్తారు. ఆ విమానం సౌదీ అరేబియాలోని తబుక్‌కు మళ్లి సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనపై యూఏఈ అధికారులు దర్యాప్తు చేపట్టారు.