Revati Chowdary: బెస్ట్ సీఎం చంద్రబాబే: సినీ నటి రేవతి చౌదరి పొగడ్తలు

షార్ట్స్‌లో చూడండి
దేశంలోకెల్లా అత్యుత్తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడేనని 'కాకతీయుడు', 'గోలగోల' ఫేమ్, నటి రేవతి చౌదరి వ్యాఖ్యానించారు. ఏలూరులో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె, చంద్రబాబు ప్రభుత్వం ప్రజల కోసం వందకు పైగా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని, వాటి కారణంగా కోట్లాది మంది లబ్దిని పొందారని అన్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న చంద్రబాబునాయుడుకు మరోసారి ముఖ్యమంత్రి పదవిని అప్పగించాలని, టీడీపీకి ఓటేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలోని మహిళలంతా టీడీపీ వైపే ఉన్నారని, వారంతా తిరిగి చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. రేవతి చౌదరితో పాటు 'మహానాయకుడు'లో నటించిన హరినాథ్ బాబు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు.
Go Back to Shorts
Revati Chowdary
Chandrababu
Telugudesam
Campaign

More Telugu News