ఎంపీ సీటు గ్యారెంటీ... వంగవీటి రాధ డిమాండ్లకు ఓకే చెప్పిన చంద్రబాబు!
- టీడీపీలో చేరికకు రంగం సిద్ధం
- స్వయంగా ప్రకటించనున్న వంగవీటి
- అనకాపల్లి లేదా నరసరావు పేట నుంచి ఎంపీగా చాన్స్
అనకాపల్లి కన్నా, విజయవాడకు దగ్గరగా ఉండే నరసరావుపేట వైపే వంగవీటి మొగ్గు చూపుతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. రేపో, మాపో పార్టీలో చేరికపై ఆయనే స్వయంగా ప్రకటిస్తారని చెబుతున్నారు. ఎంపీగా పోటీ చేస్తే, ఆపై ఫలితం తారుమారైనా రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటామని, విజయవాడకు జరిగే మునిసిపల్ ఎన్నికల్లో రాధ అనుచరులకు ప్రాతినిధ్యం కల్పిస్తామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం.