Nagarjuna: 'దేవదాస్'కి రిలీజ్ డేట్ సెంటిమెంట్

షార్ట్స్‌లో చూడండి
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున .. నాని కథానాయకులుగా 'దేవదాస్' సినిమా రూపొందుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. డాన్ గా నాగార్జున .. డాక్టర్ గా నాని నటిస్తోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నట్టుగా నిన్ననే ప్రకటించారు.

ఆ రోజున ఈ సినిమాను విడుదల చేయడం వెనుక ఒక సెంటిమెంట్ ఉందనేది తాజా సమాచారం. గతంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మించబడిన 'స్టూడెంట్ నెంబర్ 1' సినిమా ఘన విజయాన్ని సాధించింది. అందువలన అదే సెంటిమెంట్ తో 'దేవదాస్'ను అదే రోజున విడుదల చేయాలని అశ్వనీదత్ నిర్ణయించుకున్నారట. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' రిలీజ్ అయిన రోజునే 'మహానటి'ని రిలీజ్ చేసి ఆయన సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే.  
Go Back to Shorts
Nagarjuna
nani

More Telugu News