nagarjuna: నాగార్జున కంటే నానికి రెట్టింపు పారితోషికం?

షార్ట్స్‌లో చూడండి
 వరుస సినిమాలతో .. వరుస విజయాలతో నాని దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా వచ్చిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమా పరాజయంపాలైనా, ఆయన క్రేజ్ దెబ్బతినలేదు. ఆయన తీసుకునే పారితోషికంలోను పెద్దగా మార్పులు జరగలేదు. ప్రస్తుతం ఆయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు. నాగార్జున .. నాని ప్రధానమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమా షూటింగు దశలో వుంది.

ఈ సినిమా కోసం నాగార్జున 4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా .. నానికి అంతకి రెట్టింపు ముట్టిందని అంటున్నారు. ఇంతకు ముందు సినిమాలకి తీసుకున్నట్టుగానే ఆయన ఈ సినిమాకీ తీసుకున్నాడు. కథలో నాని పాత్ర స్క్రీన్ పై ఎక్కువగా కనిపిస్తుందనీ .. ఆయన పోర్షన్ ఎక్కువగా ఉండటం వల్లనే నాని అంతమొత్తం తీసుకున్నాడని అంటున్నారు. ఇక 'బిగ్ బాస్ 2' రూపంలోనూ అదృష్టం నాని తలుపు తట్టిందని చెప్పుకుంటున్నారు. 
Go Back to Shorts
nagarjuna
nani

More Telugu News