- కోనసీమ జిల్లా మామిడికుదురులో ఓఎన్జీసీ గ్యాస్ లీక్
- మూసివేసిన వెల్ వద్ద రీ డ్రిల్లింగ్ చేస్తుండగా ఘటన
- భారీ శబ్దాలు రావడంతో భయాందోళన చెందిన ప్రజలు
- ఈ ఏడాది జనవరిలోనూ మలికిపురంలో ఇదే తరహా ప్రమాదం
- ఓఎన్జీసీ తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీక్ తీవ్ర కలకలం సృష్టించింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాడివారి మెరక వద్ద ఓఎన్జీసీకి చెందిన సీఎన్‌జీ గ్యాస్ పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీకైంది. భారీ శబ్దాలు రావడంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
వివరాల్లోకి వెళ్తే, ఓఎన్జీసీ గతంలో మూసివేసిన ఒక బావి వద్ద రీ డ్రిల్లింగ్ పనులు చేపట్టింది. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో గ్యాస్ బయటకు వెలువడటం ప్రారంభమైంది. సమాచారం అందుకున్న వెంటనే ఓఎన్జీసీ నిపుణుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, గ్యాస్ లీకేజీని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది.
ఈ ఏడాది జనవరి 5వ తేదీన మలికిపురం మండలం ఇరుసుమండలోనూ ఇదే తరహాలో భారీ బ్లో అవుట్ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రమాదమే పునరావృతం కావడంతో కోనసీమ వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఓఎన్జీసీ, గెయిల్ సంస్థల పైప్‌లైన్ల నుంచి గ్యాస్ లీకులు జరుగుతున్నాయని, తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం చూపడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.