- ఇంటి బాల్కనీలో రాకెట్ పడిన ఘటనపై వివేక్ అగ్నిహోత్రి ట్వీట్
- పెద్ద ప్రమాదం తప్పిందని, కఠిన నిబంధనలు కావాలని పోస్ట్
- సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో పోస్ట్‌ను తొలగింపు
- ఏ వివాదానికి కారణం కాదల్చుకోలేదని స్పష్టం చేసిన ఫిల్మ్ మేకర్
ప్రముఖ ఫిల్మ్ మేకర్ వివేక్ అగ్నిహోత్రి తన ఇంటిపై దీపావళి రాకెట్ పడిన ఘటనపై చేసిన ట్వీట్‌ను తొలగించారు. సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏ వివాదానికి తాను కారణం కాదల్చుకోలేదని, ఏ వర్గానికి చెందిన సాంస్కృతిక లేదా పర్యావరణ వాదనకు బలం చేకూర్చడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. అందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్ట్ పెట్టారు.
అంతకుముందు, తన ఇంటి బాల్కనీలో ఉన్న సోఫాపై ఓ రాకెట్ పడి నిప్పంటుకుందని వివేక్ అగ్నిహోత్రి తన పాత ట్వీట్‌లో పేర్కొన్నారు. సమయానికి తమ పెంపుడు కుక్కలు అప్రమత్తం చేయడం, సోఫాకు ఫైర్-రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్ ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని వివరించారు. దారి తప్పి వచ్చే రాకెట్లు అగ్ని ప్రమాదాలకు కారణమవుతాయని, అవి సాంస్కృతిక గర్వకారణం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తులను ప్రమాదంలో పడేయడం మన సంస్కృతి కాదని ఆయన అన్నారు. నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, అగ్నిప్రమాదాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముంబై మేయర్ రీతూ తవాడేను ఉద్దేశించి రాశారు. అయితే, ఈ పోస్ట్‌పై విమర్శలు రావడంతో ఆయన దాన్ని తొలగించి, వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.