- హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ సిద్ధం
- 1.80 లక్షల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నగరాభివృద్ధి
- ప్రణాళిక రూపొందించిన సింగపూర్ సంస్థ ‘డీపీ ఆర్కిటెక్ట్స్’
- లైఫ్ సైన్సెస్, ఏఐ సిటీ, హెల్త్ సిటీ వంటి ప్రత్యేక జోన్ల ఏర్పాటు
- భూముల జోనింగ్‌పై రైతులు, యజమానుల్లో నెలకొన్న ఉత్కంఠ
హైదరాబాద్ శివార్లలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. సింగపూర్‌కు చెందిన ప్రఖ్యాత సంస్థ ‘డీపీ ఆర్కిటెక్ట్స్’ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ ప్రణాళికను రూపొందించింది. మొత్తం 1.80 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ నగరం మాస్టర్ ప్లాన్‌ను త్వరలో జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పురపాలక శాఖ అధికారుల సమాచారం ప్రకారం, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) పరిధిలోని 7 మండలాలు, 71 రెవెన్యూ గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందించారు. నగరాల అస్తవ్యస్త విస్తరణకు అడ్డుకట్ట వేస్తూ, పర్యావరణ సమతుల్యతను కాపాడటం దీని ముఖ్య ఉద్దేశం. భూ వినియోగ ప్రణాళిక కింద వ్యవసాయ, నివాస, పారిశ్రామిక, వాణిజ్య, పర్యావరణ పరిరక్షణ ప్రాంతాలను స్పష్టంగా విభజించారు. పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తూనే ఉద్యోగుల నివాసాలు, విద్య, వైద్యం వంటి సామాజిక వసతులపై దృష్టి సారించారు.
2047 నాటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ప్లాన్‌లో రవాణా సౌకర్యాలకు పెద్దపీట వేశారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులను అనుసంధానించనున్నారు. పర్యావరణ అనుమతులపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో పిటిషన్ దాఖలు కావడంతో, చెరువులు, నాలాలు, అటవీ ప్రాంతాల పరిరక్షణకు ఈ ప్రణాళికలో స్పష్టమైన మార్గదర్శకాలు చేర్చారు.
వివిధ జోన్లకు భూ కేటాయింపులు ఇలా..
ఈ మాస్టర్ ప్లాన్‌లో వివిధ రంగాలకు ప్రత్యేక జోన్లను కేటాయించారు. ఇందులో లైఫ్ సైన్సెస్ హబ్‌కు 4,000 ఎకరాలు, నివాస ప్రాంతాలకు 2,477 ఎకరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు-ఎనర్జీ పార్కులకు 1,976 ఎకరాలు కేటాయించారు. అలాగే హెల్త్ సిటీకి 594 ఎకరాలు, ఏఐ సిటీకి 403 ఎకరాలు, డేటా సెంటర్ హబ్‌కు 313 ఎకరాలు, ఎడ్యుకేషన్ హబ్‌కు 255 ఎకరాలు కేటాయించారు.
మరోవైపు, మాస్టర్ ప్లాన్ సిద్ధమైన నేపథ్యంలో తమ భూములు ఏ జోన్ పరిధిలోకి వస్తాయోనన్న ఆందోళన రైతులు, భూ యజమానులు, రియల్ ఎస్టేట్ వర్గాల్లో నెలకొంది. రైతుల హక్కులు, భూసేకరణ, పరిహారం వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌కు దక్షిణంగా రంగారెడ్డి జిల్లాలో ఓఆర్ఆర్, శ్రీశైలం, నాగార్జునసాగర్ హైవేల మధ్య విస్తరించి ఉన్న ఈ నగరాన్ని ‘నెట్-జీరో స్మార్ట్ సిటీ’గా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.