- పెట్రోల్‌లో పరిమితికి మించి ఇథనాల్ కలుపుతున్నారని ఆయిల్ కంపెనీలపై రాహుల్ ఆరోపణ
- కర్ణాటక ప్రభుత్వ ల్యాబ్ టెస్టుల్లో 31శాతం వరకు ఇథనాల్ ఉన్నట్లు వెల్లడైందని వ్యాఖ్య
- తమపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండించిన ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలు
- ఈ వివాదంతో వాహనాల మైలేజీ, ఇంజిన్ల భద్రతపై వినియోగదారుల్లో పెరిగిన ఆందోళన
దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్‌లో ప్రభుత్వం నిర్దేశించిన 20 శాతం పరిమితికి మించి ఇథనాల్ కలుపుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన ల్యాబొరేటరీ పరీక్షల ఫలితాలను ఉటంకిస్తూ ఆయన శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు. "E20 కాస్తా 420గా మారింది – ప్రజల కార్ల నుంచి పెట్రోల్ దొంగిలిస్తున్నారు!" అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా తీవ్రస్థాయిలో విమర్శించారు. చమురు సంస్థల టెస్టింగ్ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ఆయన ప్రశ్నించారు.
కర్ణాటక ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి రిజ్వాన్ అర్షద్ విడుదల చేసిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని ఏడు జిల్లాల నుంచి సేకరించిన 14 పెట్రోల్ శాంపిల్స్‌ను ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్‌లో పరీక్షించగా, 11 శాంపిల్స్‌లో ఇథనాల్ శాతం 20కి మించి ఉన్నట్లు తేలింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) శాంపిల్‌లో 31.2 శాతం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) శాంపిల్‌లో 30.5 శాతం ఇథనాల్ ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), నయారా ఎనర్జీ, షెల్ వంటి సంస్థల నుంచి సేకరించిన ఇతర శాంపిల్స్‌లో ఇథనాల్ శాతం 25.5 నుంచి 26.5 మధ్య ఉన్నట్లు తేలింది. బెంగళూరు, కోలార్, చిక్కబళ్లాపుర, బెంగళూరు గ్రామీణ, రామనగర, మంగళూరు, తుమకూరు జిల్లాల్లో ఈ శాంపిల్స్‌ను సేకరించారు.
అధిక మోతాదులో ఇథనాల్ కలపడం వల్ల వాహనదారుల మైలేజీ తగ్గడమే కాకుండా ఇంజిన్‌లు దెబ్బతినే ప్రమాదం ఉందని మంత్రి రిజ్వాన్ అర్షద్ ఆందోళన వ్యక్తం చేశారు. మొదట ఈ శాంపిల్స్‌ను ఆయిల్ కంపెనీల ల్యాబ్‌లకు పంపగా, వారు ఇథనాల్ శాతం వివరాలు వెల్లడించలేదని, అందుకే స్వతంత్ర ల్యాబ్‌లో పరీక్షలు చేయించాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
ఆరోపణలను ఖండించిన చమురు సంస్థలు
అయితే, కర్ణాటక ప్రభుత్వం, రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సహా అన్ని చమురు మార్కెటింగ్ కంపెనీలు తీవ్రంగా ఖండించాయి. శాంపిల్స్ సేకరణ, పరీక్షా విధానాలు నిర్దేశిత చట్టబద్ధమైన మార్గదర్శకాల ప్రకారం జరగలేదని ఆక్షేపించాయి. తాము దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 893 శాంపిల్స్‌తో జాయింట్ క్వాలిటీ మానిటరింగ్ నిర్వహించామని, అందులో కర్ణాటకకు చెందిన 56 శాంపిల్స్ కూడా ఉన్నాయని తెలిపాయి.
ఈ పరీక్షల్లో ఇథనాల్ శాతం 19 నుంచి 21 శాతం మధ్యలోనే ఉందని, కర్ణాటక శాంపిల్స్‌లో సగటున 19.3 శాతంగానే నమోదైందని స్పష్టం చేశాయి. ఈ తాజా వివాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం, దాని ప్రభావంపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. వాహనాల పనితీరు, వినియోగదారులపై పడుతున్న భారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.