- కూకట్పల్లి ఫ్లాట్లపై 17 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం
- 101 మందికి నవంబర్ 23లోగా రిజిస్ట్రేషన్ చేయాలని సుప్రీం ఆదేశం
- కొనుగోలుదారులకు అత్యున్నత న్యాయస్థానంలో భారీ ఊరట
- 14 శాతం వడ్డీ వసూలుపై హైకోర్టుదే తుది నిర్ణయమని స్పష్టీకరణ
- కేసు తేలే వరకు ఆస్తులు అమ్మరాదని ఇరువర్గాలకు ఆంక్షలు
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) ఫేజ్-15లో ఇళ్ల కోసం గత 17 ఏళ్లుగా నిరీక్షిస్తున్న కొనుగోలుదారులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వివాదంలో ఉన్న 101 ఫ్లాట్లను ఈ నెల 23వ తేదీలోగా కొనుగోలుదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని తెలంగాణ హౌసింగ్ బోర్డును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లిలతో కూడిన ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
వాయిదాల చెల్లింపుల్లో జాప్యం జరిగిన వారి నుంచి 14 శాతం వడ్డీ వసూలు చేయాలా? వద్దా? అనే అంశాన్ని హైకోర్టు తేల్చే వరకు వేచి చూడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, వడ్డీ వివాదం తేలే వరకు కొనుగోలుదారులను ఇబ్బంది పెట్టకూడదని పేర్కొంటూ, తక్షణమే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. హైకోర్టులో కేసు పరిష్కారమయ్యే వరకు ఈ ఇళ్లను ఇతరులకు విక్రయించడం లేదా బదిలీ చేయడం వంటి చర్యలు చేపట్టరాదని అటు హౌసింగ్ బోర్డుకు, ఇటు కొనుగోలుదారులకు న్యాయస్థానం ఆంక్షలు విధించింది.
2009లో హౌసింగ్ బోర్డు 'సంపూర్ణం' పథకం కింద కేపీహెచ్బీలో ఇళ్లను కేటాయించింది. తొలుత ఫ్లాట్ ధరను రూ.30.80 లక్షలుగా నిర్ణయించి, ఆ తర్వాత దానిని రూ.47.85 లక్షలకు పెంచడంతో వివాదం మొదలైంది. నిర్మాణంలో జాప్యం, అదనపు ధరల వసూలుపై కొనుగోలుదారులు వినియోగదారుల ఫోరం నుంచి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ) వరకు న్యాయపోరాటం చేశారు. బోర్డు వైపు నుంచే జాప్యం జరిగిందని నిర్ధారించిన ఎన్సీడీఆర్సీ, కొనుగోలుదారుల నుంచి 14 శాతం వడ్డీ వసూలు చేయడం సమర్థనీయం కాదని గతంలో తీర్పునిచ్చింది.
ఈ తీర్పును సవాలు చేస్తూ హౌసింగ్ బోర్డు తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా.. తమ వైపు నుంచి జరిగిన ఆలస్యానికి 6 శాతం వడ్డీ చెల్లిస్తామని, అయితే కొనుగోలుదారుల నుంచి మాత్రం 14 శాతం వడ్డీ వసూలుకు అనుమతించాలని బోర్డు కోరింది. బోర్డు వాదనను తోసిపుచ్చిన ధర్మాసనం, బాధితుల 17 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది.