- కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో రాజుకున్న వివాదం
- తోపుదుర్తి సోదరులపై ఎస్పీకి పరిటాల సునీత ఫిర్యాదు
- ఇరువర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జి చేసిన పోలీసులు
అనంతపురం జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉద్రిక్తంగా మారింది. కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో నెలకొన్న వివాదం ఘర్షణకు దారితీయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.
వివరాల్లోకి వెళ్తే, ఆత్మకూరు జడ్పీటీసీ ఓట్ల లెక్కింపులో భాగంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరులైన రాజశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, నయనతరెడ్డి కౌంటింగ్ ఏజెంట్లుగా వ్యవహరించడం వివాదానికి కారణమైంది. వారు కౌంటింగ్ హాల్లో ఉంటే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే అవకాశం ఉందని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆమె జిల్లా ఎస్పీ జగదీశ్ దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ క్రమంలో ఇరువర్గాల మద్దతుదారులు వాగ్వాదానికి దిగి, పరస్పరం దాడులు చేసుకున్నారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు వెంటనే లాఠీచార్జి చేసి, గుంపును చెదరగొట్టారు. ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.