- మృతుడు ప్రముఖ వైద్యుడు కొమ్మినేని శేషగిరిరావు మనవడు ఆకాశ్
- అట్లాంటా వద్ద కారును భారీ ట్రక్కు ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు
- ఇటీవలే ఉద్యోగంలో చేరిన ఆకాశ్ మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం
- మృతదేహం తరలింపునకు సాయం అందిస్తున్న తెలుగు సంఘాలు
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆ యువకుడు అకాల మరణం చెందడంతో అతడి కుటుంబంలో, పొన్నూరులోని బంధువుల ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు గురువారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
పొన్నూరు పట్టణంలోని 17వ వార్డు నేతాజీనగర్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు, దివంగత కొమ్మినేని శేషగిరిరావు మనవడైన ఆకాశ్ (26) ఈ ప్రమాదంలో మృతి చెందాడు. శేషగిరిరావు పెద్ద కుమారుడు కల్యాణ చక్రవర్తి, పద్మ దంపతులు చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు. వారి పెద్ద కుమారుడే ఆకాశ్. ఇటీవలే చదువు పూర్తి చేసుకుని ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగంలో చేరాడు.
నవంబరు 1వ తేదీన అట్లాంటా సమీపంలో ఆకాశ్ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన ఓ భారీ ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయి మంటలు చెలరేగినట్లు తెలిసింది. ఈ దుర్ఘటనలో ఆకాశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద ఘటనపై స్థానిక అధికారులు విచారణ చేపట్టి, కారణాలను అన్వేషిస్తున్నారు.
ఉద్యోగంలో స్థిరపడి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న సమయంలో ఆకాశ్ మరణవార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహానికి సంబంధించిన అధికారిక ప్రక్రియలు పూర్తి చేసి, తరలించేందుకు అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు సహాయ సహకారాలు అందిస్తున్నారు.