- పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్న సతీశ్ రెడ్డి
- చివరకు జగన్ ను కూడా ఇబ్బంది పెట్టారని ఆవేదన
- వైసీపీపై కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మండిపాటు
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్... ముఖ్యంగా పులివెందులలో, తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అధికార కూటమి ప్రభుత్వం రిగ్గింగ్, దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది.
ఈ అంశంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ఓ టీవీ ఛానల్ డిబేట్లో మాట్లాడుతూ అధికార కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పులివెందులలో తమ పార్టీ ఏజెంట్లను సుమారు 70 పోలింగ్ బూత్‌ల నుంచి తరిమికొట్టి యథేచ్ఛగా రిగ్గింగ్ చేశారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సరళిని కవర్ చేయడానికి వెళ్లిన 'ఇండియా టుడే' జర్నలిస్టులు అబ్దుల్ బషీర్, వీడియో జర్నలిస్ట్ విజయ్‌పై అధికార పార్టీ వర్గాలు దాడి చేసి కెమెరాను ధ్వంసం చేశాయని ఆయన మండిపడ్డారు.
పులివెందులలో టీడీపీ గూండాల దాడిన తీవ్రంగా ఖండిస్తున్నానని సతీశ్ రెడ్డి చెప్పారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి వైసీపీపై కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరించిందని మండిపడ్డారు. పులివెందులలో 80 పోలింగ్ బూత్‌లు ఉంటే... 70 బూత్‌ల నుంచి వైసీపీ ఏజెంట్లను తన్ని తరిమేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఎన్నికల సంఘం, ప్రభుత్వం ఏకమై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.
చివరకు తమ పార్టీ అధినేత జగన్ ను కూడా ఇబ్బంది పెడుతున్నారని సతీశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత ప్రమాదకరమని చెప్పారు.