- అక్రమ మైనింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
- కాకాణి అనుచరుడు వాకాటి శ్రీనివాసులు రెడ్డికి నోటీసులు
- ఈ కేసులో ఏ 3గా శ్రీనివాసులు రెడ్డి, ఏ 4 గా కాకాణి
- విచారణకు హాజరుకావాలని నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆదేశం
నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడైన వాకాటి శ్రీనివాసులు రెడ్డికి శనివారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు స్వయంగా హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
పొదలకూరు మండలం వరదాపురం సమీపంలోని రుస్తుం మైన్‌లో జరిగిన అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో వాకాటి శ్రీనివాసులు రెడ్డి ఏ3 (మూడో నిందితుడు)గా ఉన్నారు. ఆయన నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఎదుట విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. శ్రీనివాసులు రెడ్డి గతంలో పోదలకూరు ఉప సర్పంచిగా పనిచేశారు.
ఈ అక్రమ మైనింగ్ కేసులో మొత్తం 11 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. ఇదే కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏ4 (నాలుగో నిందితుడు)గా ఉండటం గమనార్హం.