- ఏపీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
- తొలి ట్రెండ్స్‌లో పలుచోట్ల టీడీపీ, జనసేన ముందంజ
- ఏలూరు కార్పొరేషన్లో జనసేన పార్టీకి లీడ్
ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లో మొదలైన ఈ కౌంటింగ్‌లో తొలి ట్రెండ్స్ వెలువడుతున్నాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అధికారులు, ఆ తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.
ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్స్ ప్రకారం విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, చిత్తూరు కార్పొరేషన్లలో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఏలూరు కార్పొరేషన్లో జనసేన పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
మున్సిపాలిటీల విషయానికొస్తే... అనేక చోట్ల టీడీపీ హవా కనిపిస్తోంది. మాచర్ల, ఎమ్మిగనూరు, మార్కాపురం, సూళ్లూరుపేట, పలమనేరు, నందిగామ, జగ్గయ్యపేట, నందికొట్కూరు, నర్సీపట్నం, పెనుకొండ వంటి మున్సిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. తిరువూరు, అమలాపురం, మడకశిర మున్సిపాలిటీల్లో జనసేన పార్టీకి ఆధిక్యం లభించింది. ఇక గిద్దలూరులో బీజేపీ, ఉయ్యూరులో వైసీపీ ముందంజలో ఉన్నాయి.