- కర్ణాటకలో నవంబర్ 5 నుంచి పెరగనున్న బస్ చార్జీలు
- రూ.9,000 కోట్ల నష్టాలే కారణమంటున్న ప్రభుత్వం
- రవాణా మంత్రి బైరతి సురేశ్ అధికారిక ప్రకటన
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయాణికులపై మరో భారం మోపడానికి సిద్ధమైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆర్టీసీ బస్సు చార్జీలను నవంబర్ 5వ తేదీ నుంచి పెంచుతున్నట్లు రవాణా శాఖ మంత్రి బైరతి సురేశ్ ప్రకటించారు. భారీ ఆర్థిక నష్టాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని నాలుగు రోడ్డు రవాణా సంస్థలు (ఆర్టీసీలు) ఇప్పటికే రూ.9,000 కోట్ల భారీ నష్టాల్లో కూరుకుపోయాయని మంత్రి వివరించారు. గడిచిన ఏడాది కాలంలో డీజిల్ ధరలు ఐదుసార్లు పెరగడం వల్ల సంస్థలపై ఏటా రూ.2,000 కోట్ల అదనపు భారం పడుతోందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో చార్జీల పెంపు అనివార్యమైందని ఆయన పేర్కొన్నారు.
చార్జీల పెంపు అధికారాన్ని ముఖ్యమంత్రి రవాణా శాఖకే అప్పగించారని, గత వారం కేబినెట్లో దీనిపై చర్చ జరిగిందని మంత్రి సురేశ్ చెప్పారు. అయితే, చార్జీలను ఎంతమేర పెంచాలనే దానిపై నవంబర్ 4న ఆర్టీసీ అధికారులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే 'శక్తి' పథకం అమలు తర్వాత ఆర్టీసీ బస్సుల్లో పురుష ప్రయాణికుల శాతం 48 నుంచి 36 శాతానికి పడిపోయిందని, ఇది కూడా సంస్థల ఆదాయంపై కొంత ప్రభావం చూపిందని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బస్ చార్జీలు పెంచడం ఇది రెండోసారి.