- బాధిత బాలికలు త్వరగా కోలుకోవాలని ప్రార్థన
- స్నేహితురాలిని కాపాడిన బాలిక ధైర్యానికి ప్రశంసలు
- వైద్యులు, ఏపీ ప్రభుత్వం, పోలీసు బృందాలకు కృతజ్ఞతలు
- బాధిత విద్యార్థుల కోసం 20 మంది కౌన్సెలర్ల నియామకంపై హర్షం
- మహిళల పట్ల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలని సూచన
అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినులపై జరిగిన దాడి తనను తీవ్రంగా కలచివేసిందని సినీ నటుడు మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ తండ్రిగా ఈ ఘటన తనను ఎంతో బాధించిందని పేర్కొన్నాడు. బాధిత బాలికలు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపాడు. ఈ మేరకు అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించాడు.
బాధితురాలిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో బాలిక ధైర్యాన్ని మనోజ్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. స్నేహితురాలిని రక్షించేందుకు ముందుకొచ్చిన ఆ చిన్నారి అసాధారణ సాహసం చేసిందని కొనియాడాడు. ఆమెకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాలని పేర్కొన్నాడు. బాలికలకు ప్రాణాపాయ స్థితిలో చికిత్స అందిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలిపాడు. మెరుగైన వైద్యం కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి, తరలింపు ప్రక్రియను సమన్వయం చేసిన ఏపీ ప్రభుత్వం, పోలీసు, వైద్య బృందాలను అభినందించాడు.
ఈ ఘటనతో ప్రభావితమైన విద్యార్థులకు 20 మంది మానసిక ఆరోగ్య కౌన్సెలర్లను నియమించడం సంతోషకరమని మనోజ్ అన్నాడు. బాధిత విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, కుటుంబాలకు కూడా నిరంతర మానసిక సహకారం అందించాలని కోరాడు.
మహిళలను వస్తువులుగా చూడటం, సరదా పేరుతో కించపరచడం సమాజంలో ప్రమాదకర ఆలోచనలకు దారితీస్తుందని మనోజ్ అభిప్రాయపడ్డాడు. వేధింపులు, హింసకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉండాలని అన్నాడు. మహిళల పట్ల గౌరవం ఇంటి నుంచే మొదలవుతుందని, పిల్లలు పెద్దలను చూసే నేర్చుకుంటారని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే మహిళలకు సురక్షితమైన సమాజాన్ని నిర్మించగలమని పిలుపునిచ్చాడు.