- అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
- బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా
- రెండు రోజుల్లో 100% విద్యుత్ పునరుద్ధరణే లక్ష్యమని ప్రకటన
- రూ.4600 కోట్ల ప్రాథమిక నష్టం జరిగిందని కేంద్రానికి నివేదిక
- నష్టపోయిన రైతులకు పరిహారం, పునరావాస శిబిరాల నుంచి వెళ్లేవారికి ప్రత్యేక ప్యాకేజీ
"తుపానును మనం పూర్తిగా నివారించలేం. కానీ, మనకు ఉండే ప్రత్యేక పరిస్థితుల్లో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించాలి. అర్నబ్ తుపానును సమర్థవంతంగా ఎదుర్కొని ఎవరికీ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాను" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 'అర్నబ్' తుపాను సృష్టించిన బీభత్సం నేపథ్యంలో గురువారం ఆయన కృష్ణా, పశ్చిమ గోదావరి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ చర్యలను, భవిష్యత్ ప్రణాళికలను సుదీర్ఘంగా వివరించారు.
ముందస్తు చర్యలతో ప్రాణనష్టం తగ్గించాం
గతంలో 1977 దివిసీమ తుపాను, 1996 కోనసీమ తుపాను సృష్టించిన విధ్వంసాలను గుర్తుచేసుకున్న చంద్రబాబు, ఆ అనుభవాలతో ఈసారి పటిష్టమైన ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
"ఈసారి ఒకే ఒక్క టార్గెట్ పెట్టుకున్నాను, ప్రాణనష్టం సున్నాగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దురదృష్టవశాత్తు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. టెక్నాలజీని ఉపయోగించి తుఫాను గమనాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేశాం. రాత్రంతా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ విభాగాలను మోహరించాం. ఏ ప్రాంతంలో ఎంత తీవ్రత ఉంటుందో నిమిష నిమిషానికి సమాచారం అందించాం. దీనివల్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగాం" అని ఆయన వివరించారు. కొంతమంది తుపాను హెచ్చరికలను ఎగతాళి చేశారని, కానీ తీవ్రత పెరిగాక వాస్తవం గ్రహించారని అన్నారు.
30 ఏళ్ల కిందటి జ్ఞాపకాలు కళ్లముందు..
ఈ సందర్భంగా 30 ఏళ్ల క్రితం 1996లో వచ్చిన తుఫాను నాటి భయానక పరిస్థితులను చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
"ఆ రోజు నా కళ్ల ముందు ఆ దృశ్యాలు ఇంకా కదలాడుతున్నాయి. అప్పుడు ప్రైవేట్ ఫ్లైట్స్ లేవు, డిఫెన్స్ విమానంలో వచ్చాను. ఆర్మీ హెలికాప్టర్ సిబ్బంది ప్రాణాపాయం ఉంటుందని నన్ను తీసుకెళ్లలేమని చెప్పినా, నేను బలవంతం చేసి వెళ్లాను. రోడ్డు మీద దిగి మత్స్యకార గ్రామాలను చూస్తే భయంకరమైన దృశ్యాలు కనిపించాయి. ముమ్మడివరం, అమలాపురంలో దిగి ప్రజలకు ధైర్యం చెప్పి, రాజమండ్రి ఆర్డీవో ఆఫీసునే సెక్రటేరియట్‌గా మార్చి, ప్రతి మండలానికి ఒక సెక్రటరీని నియమించి వారం రోజుల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చాం. ఆనాటి పరిస్థితులతో పోలిస్తే, ఈరోజు టెక్నాలజీ సాయంతో వేగంగా స్పందించగలుగుతున్నాం" అని ఆయన తెలిపారు.
వెయ్యి మందిని పంపమని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాను
తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15,000 విద్యుత్ స్తంభాలు దెబ్బతింటాయని అంచనా వేయగా, ఒక్క కోనసీమలోనే 8,000 స్తంభాలు నేలకూలాయని చంద్రబాబు తెలిపారు.
"తుపాను తీరం దాటిన వెంటనే చెట్లను తొలగించే పనులు ప్రారంభించాం. ఈరోజు మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు క్లియర్ చేశాం. విద్యుత్ పునరుద్ధరణే ఇప్పుడు మా ముందున్న ప్రధాన సవాలు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి 1000 మంది సిబ్బందిని పంపమని కోరాను. అవసరమైతే తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా అదనపు సిబ్బందిని తెప్పిస్తాం. ఎల్లుండిలోగా ప్రతి ఇంటికి 100% విద్యుత్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం" అని ఆయన హామీ ఇచ్చారు.
టెలికమ్యూనికేషన్ సిగ్నల్స్‌కు అంతరాయం కలగకుండా జనరేటర్లు, డీజిల్ సిద్ధం చేసుకోవాలని ఆపరేటర్లకు సూచించినా, కొందరు నిర్లక్ష్యం చేశారని, వారికి అవసరమైతే ప్రభుత్వమే డీజిల్ ఖర్చులు భరిస్తుందని చెప్పామని అన్నారు.
నష్టపరిహారంపై స్పష్టమైన హామీ
తుపాను వల్ల ప్రాథమికంగా రూ. 4,600 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. "కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడాను. ఆయన స్వయంగా ఫోన్ చేసి శుక్రవారం కేంద్ర బృందాన్ని పంపిస్తానని చెప్పారు. ప్రాథమిక నష్టాల నివేదికను కేంద్రానికి పంపాం. కేంద్ర బృందం పర్యటన తర్వాత పూర్తిస్థాయి నివేదిక అందించి సహాయం కోరతాం" అని తెలిపారు.
బాధితులకు అందించే పరిహారంపై స్పష్టత ఇస్తూ, "కొబ్బరి, ఆయిల్ పామ్ చెట్టుకు రూ. 1,500 చొప్పున పరిహారం అందిస్తాం. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లే ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, ఇతర నిత్యావసరాలతో కూడిన ప్యాకేజీతో పాటు కొంత నగదు కూడా అందిస్తాం. వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టం జరగకుండా ఆదుకుంటాం. ఈసారి పంటలకు బీమా కూడా చేయించాం కాబట్టి దిగుబడి తగ్గినా పరిహారం అందుతుంది" అని భరోసా ఇచ్చారు.
విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, ఎన్నికలకు, సహాయక చర్యలకు సంబంధం లేదని, విపత్తు వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవడం తన బాధ్యత అని అన్నారు. గత 'మొంథా' తుపాను పరిహారంపై మాట్లాడుతూ, అర్హులైన ప్రతి రైతుకు నష్టపరిహారం అందిందని, ఈసారి కూడా పక్కాగా అంచనాలు వేసి త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో తుఫానులను తట్టుకునేలా కోస్తా తీరంలోని కీలక ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసే ఆలోచన ఉందని చంద్రబాబు వెల్లడించారు.